చైతన్య : జారుడు ప్రారంభిస్తే తేలేది పాతాళంలోనే !

నాలుగేళ్ల పాటు తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న వైఎస్ఆర్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం అదీ కూడా సొంత ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు కోలుకోలేని షాక్ లాంటిదే. దీంతో వైఎస్ఆర్‌సీపీ వ్యూహకర్తల్లో అంతర్మథనం ప్రారంభమయింది. తప్పు ఎక్కడ జరుగుతోంది ? వ్యూహాలు ఎందుకు ఫెయిలవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

కళ్ల ముందు కనిపిస్తున్న వైసీపీ పతనం !

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాజకీయ వాతావరణ అధికార పార్టీకి నెగెటివ్‌గా మారే పరిస్థితి ప్రారంభం కావడం మరింత ఆందోళనకరం. అందుకే ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలన్న సూచనలు ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. ఏడు స్థానాల్లోనూ గెలుపొందడానికి అవసరమైన బలం ఉందని అధికారికంగా పార్టీలో చేరకపోయినా టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు , ఒక జనసేన ఎమ్మెల్యేతో అన్ని స్థానాలు గెలువవచ్చని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా గత వారం రోజులుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఒక్క ఓటు కూడా చెల్లని ఓటు పడకూడదన్న లక్ష్యంతో ఓటింగ్ ప్రాక్టీస్ చేయించారు. చివరికి ఉగాది పండుగ రోజు సాయంత్రం కల్లా అందరూ క్యాంపులకు చేరుకునే ఏర్పాట్లు చేశారు. అందర్నీ విజయవాడలోని హోటళ్లకు చేర్చి ఉదయమే ఓటింగ్‌కు తీసుకెళ్లారు. ఇంత పకడ్బందీగా చేసినా చివరికి ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొత్తం కృషి వృధా పోయింది.

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నాయకుడు రాణించలేడు !

వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని భావించిన ఎమ్మెల్యేల గురించి సీఎం జగన్ ముందుగానే ఆరా తీశారు. అలాంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా మాట్లాడారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. కొంత మంది బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా క్లిష్టంగా ఉన్నా బిల్లులు కూడా మంజూరు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే అలాంటి వారెవరూ క్రాస్ ఓటింగ్ చేయలేదని చెబుతున్నారు. జగన్ ప్రత్యేకంగా పిలిచి బుజ్జగించినా క్రాస్ ఓటింగ్ చేయడం ఆ పార్ట క్యాడర్ ను ఇబ్బంది పెడుతోంది. ఇది పార్టీపై గ్రిప్ పోయిందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ పతనం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టం !

మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అధికార పార్టీకి ఇబ్బందికరమే. ప్రజల్లో .. పార్టీ క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి చర్యలు చేపట్టకపోతే ఇబ్బంది అవుతుందని పార్టీ నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు. పార్టీ హైకమాండ్ కూడా దిద్దుబాటు చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. కానీ అవీ కాపాడతాయా అంటే..చెప్పడం కష్టం . ఎందుకంటే ఇప్పటికే చేతులు కాలిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close