కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ లేనట్లే.. !

తెలంగాణ బయట రెండో బహిరంగసభను కూడా కేసీఆర్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక వైపు చూడటం లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రేపో, మాపో రాబోతోంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఉనికి మాత్రం లేకుండా పోయింది. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ… తమ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ ప్రకటించడం వల్లనే … ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారన్న చర్చ ప్రారంభమయింది.

కర్ణాటకలో ఎన్నికలు ముంచుకొస్తున్నా కనీసం కొంత మంది నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటేస్తున్నారు. జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ చీఫ్ కు పరిస్థితులు కలిసి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకోవడానికి కుమారస్వామి కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఆయన కర్ణాటకలో బీఆర్ఎస్ ఎంట్రీని ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది . అందుకే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో తెలుగువారందర్నీ గురి పెట్టి అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకున్నా.. చివరికి అసలు పట్టించుకోవడం మానేశారు. దీంతో బీఆర్ఎస్ తొలి అడుగులు .. తడబడినట్లవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close