‘రోజా మేకప్, వైసీపీ ప్యాకప్, జగన్ లాకప్’

హైదరాబాద్: ఇటీవల తెలుగుదేశంలో చేరిన నెల్లూరు సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు గుప్పించారు. బజర్దస్త్ ప్రోగ్రామ్‌లోలాగా రాజకీయాలలో కూడా కామెడీ చేస్తున్నారని అన్నారు. సినిమా ఛాన్సులు లేక ఆమె టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారని, జబర్దస్త్ ప్రోగ్రామ్ అయిపోతే జగన్ ప్రోగ్రామ్‌లలో రికార్డ్ డ్యాన్సులే మిగులుతాయని ఎద్దేవా చేశారు. అప్పుడు రోజా మేకప్, వైసీపీ ప్యాకప్, జగన్ లాకప్ అవటం ఖాయమని అన్నారు. జగన్ తమను ఎదుర్కోలేక రోజాను ప్రయోగిస్తున్నారని విమర్శించారు. జగన్‌ను 130 ఏళ్ళ కాంగ్రెస్, 33 ఏళ్ళ టీడీపీ ఏమీ చేయలేకపోయాయని, రోజా పాదం మోపటంతో వైసీపీ సర్వనాశనమవుతోందోని అన్నారు. ఆమె ఎక్కడ కాలు మోపితే అక్కడ నాశనమవటం ఖాయమని చెప్పారు. ఆమె వైసీపీలోకి చేరిన తర్వాతే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. దీనికి రోజా ఏమి బదులిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close