లింగుస్వామి సినిమా నిర్మాత కూడా ఆయనే అట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తీస్తున్న సరైనోడు రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే లింగుస్వామి దర్శకత్వంలో సినిమా అని ఎనౌన్స్ చేసి ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాగా చేయబోతున్నారట. సినిమాను తమిళ్ లో కె.యి.జ్ఞాన్ వెల్ రాజా నిర్మిస్తుండగా.. తెలుగులో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారట.

అల్లు అర్జున్ తన సొంత బ్యానర్లో నటించిన హ్యాపీ, బద్రినాథ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అల్లు అర్జున్. అయితే బోయపాటి మార్క్ యాక్షన్ సినిమాగా రాబోతున్న ఈ సరైనోడు సినిమా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నారు. సినిమా అవ్వక ముందే లింగుస్వామి సినిమాకు కూడా తమ నమ్మకాన్ని బలం చేకూరేలా మళ్ళీ తామే నిర్మించడం విశేషం. మరి ప్రస్తుతం తీస్తున్న సరైనోడు సినిమా హిట్ కొట్టి ఆ మేనియా కంటిన్యూ చేసేలా చేస్తుందేమో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com