‘పుష్ష‌’పై అన‌సూయ క్లారిటీ

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ఫ‌`. ర‌ష్మిక క‌థానాయిక‌. ఇందులో అన‌సూయ కూడా ఉంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూ వుంది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా.. అన‌సూయ గుర్తుండిపోయే పాత్ర పోషించింది. ఆసినిమా అన‌సూయ‌కి పెద్ద ప్ల‌స్‌. ఆ సెంటిమెంట్ తోనే `పుష్ష‌`లోనూ అన‌సూయ‌కు సుకుమార్ ఛాన్సిచ్చాడ‌ని చెప్పుకున్నారు. ఇందులోనూ అన‌సూయ హాట్ హాట్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అన్నారు.

అయితే వీటిపై అన‌సూయ స్పందించింది. `పుష్ష‌`లో తాను లేన‌ని క్లారిటీ ఇచ్చేసింది. ”ఇంత వ‌ర‌కూ అయితే.. అలాంటి ప్ర‌తిపాద‌న ఏమీ నా దగ్గ‌ర‌కు రాలేదు. నిజంగానే వ‌స్తే.. త‌ప్ప‌కుండా చేస్తా. ఆ విష‌యం మీడియాకి కూడా నేనే చెబుతా” అని చెప్పేసింది. త‌న‌కు మిగిలిన భాష‌ల్లోంచి కూడా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని, బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా త‌న‌ని సంప్ర‌దిస్తున్నార‌ని, అయితే త‌న తొలి ప్రాధాన్యం మాత్రం టీవీకే అని, మంచి అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే సినిమాల్లో క‌నిపిస్తాన‌ని చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close