నాగ‌శౌర్య‌కి ఓ హీరో కావ‌లెను!

ఈమ‌ధ్య నాగ‌శౌర్య ద‌గ్గ‌ర‌కు ఓ మంచి క‌థ వ‌చ్చింది. శివ‌లంక కృష్ణ ప్ర‌సాద్ అనే బ‌డా నిర్మాత ఈ కథ‌ని తీసుకొచ్చారు. ఇది ఇద్ద‌రు హీరోల క‌థ‌. ఓ పాత్ర‌కు అగ్ర హీరో త‌ప్ప‌నిస‌రి. కృష్ణ ప్ర‌సాద్ కూ, బాల‌కృష్ణ‌కూ అవినాభావ సంబంధం ఉంది. ఆదిత్య 369, వంశానికొక్క‌డు, భ‌లేవాడివి బాసూ, మిత్రుడు లాంటి సినిమాల్ని నిర్మించింది ఆయ‌నే. మిత్రుడుతో బాగా న‌ష్ట‌పోయారు. అప్ప‌ట్నుంచి శివ‌లంక‌కు ఓ సినిమా చేసి ఇవ్వాల‌ని బాల‌య్య కూడా అనుకుంటూనే ఉన్నారు. అందుకే ఈ క‌థ ముందుగా బాల‌య్య ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. ఈ సినిమాలో న‌టిస్తా అని బాల‌య్య కూడా మాట ఇచ్చాడు. కానీ… త‌న బిజీ కాల్షీట్ల వ‌ల్ల‌.. కుద‌ర‌డం లేదు.

ఆ త‌ర‌వాత‌.. ఈ క‌థ నాగార్జున ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. నాగ్ కూడా ముందు ఓకే అన్నా, ఇప్పుడు చేయ‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే… నాగ్ చేతిలోనూ రెండు ప్రాజెక్టులున్నాయి. ముందుగా…ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాని ఆయ‌న ప‌ట్టాలెక్కించాలి. ఆ త‌ర‌వాత‌.. `సోగ్గాడే` ప్రీక్వెల్ ఉంది. ఈరెండు సినిమాలూ చేశాకే మిగిలిన సినిమాల వైపు దృష్టి పెట్టాలి. జూన్‌లో బిగ్ బాస్ ఎలాగూ మొద‌లైపోతుంది. దానికీ కొన్ని కాల్షీట్లు కావాలి. ఎలా చూసినా, నాగ్ కి ఈ సినిమా చేయ‌డం కుద‌ర‌డం లేదు. దాంతో బంతి మ‌ళ్లీ బాల‌య్య ద‌గ్గ‌రే ఆగింద‌ని టాక్‌. ఎలాగైనా త‌న‌కి ఈ సినిమా చేసి పెట్టాల‌ని నిర్మాత కోరుతున్నాడ‌ట‌. నాగ‌శౌర్య కూడా ఈ సినిమా విష‌యంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. మంచి క‌థ మిస్స‌వ్వ‌కూడ‌ద‌న్న‌ది శౌర్య తాప‌త్ర‌యం. మ‌రి ఏం జ‌రుగుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close