చిరంజీవి సినిమాలో అన‌సూయ‌?

‘రంగ‌స్థ‌లం’లో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా మెరిసింది. అన‌సూయ చేసిన పాత్ర‌ల్లో ది బెస్ట్.. అదే! రంగ‌స్థ‌లం విజ‌యంలో అన‌సూయ పాత్ర కూడా ఓ కీల‌క పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ చిరంజీవి ఫాలో అవుతున్నాడు. చిరంజీవి – కొర‌టాల కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. సైరా త‌ర‌వాత‌.. సెట్స్‌పైకి వెళ్లే చిరు ప్రాజెక్ట్ ఇదే. ఇందులో క‌థానాయిక పేరు ఇంకా ఖ‌రారు కాలేదు. కాక‌పోతే.. చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించేవాళ్ల పేర్లూ ఒకొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఓ పాత్ర సునీల్‌కి ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అన‌సూయ‌కీ ఈ ప్రాజెక్టులో చోటు ద‌క్కింద‌చి స‌మాచారం.

క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లో అన‌సూయ క‌నిపిస్తుంద‌ని, రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు ఎంత ప్రాధాన్య‌త ఉందో, ఈ పాత్ర‌కీ అంతే ప్రాధాన్యం ఉంటుంద‌ని, ఇప్ప‌టికే చిత్ర‌బృందం అన‌సూయ కాల్షీట్లు కూడా తీసేసుకుంద‌ని తెలుస్తోంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com