క‌మిడియ‌న్ల‌ను హీరోగా మారుస్తున్న నాని

జెర్సీతో ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు నాని. త‌న‌లోని న‌టుడికి ఇదో కొత్త పాత్ర‌. ఈ సినిమాలో న‌టుడిగానూ పీక్స్ చూపించాడు నాని. మ‌రోవైపు ఇంద్ర‌గంటి, విక్ర‌మ్ కె.కుమార్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇంకోవైపు.. నిర్మాత‌గా త‌న త‌దుప‌రి సినిమాల్ని ప‌ట్టాలెక్కించ‌డానికి స‌మాయాత్తం అవుతున్నాడు. నాని త‌న వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ఓ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నాడు. అందుకు సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది.

ఈలోగా మ‌రో సినిమానీ మొద‌లెట్టాల‌ని చూస్తున్నాడు. ఈసారి స్వ‌ప్న‌ద‌త్‌తో క‌ల‌సి ప్రొడ‌క్ష‌న్ లో పాలు పంచుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో కమిడియ‌న్లు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌లు క‌థానాయ‌కులుగా న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఇదో పూర్తిస్థాయి వినోదాత్మ‌క చిత్ర‌మ‌ని, అందుకే వాళ్ల‌ని హీరోలుగా ఎంచుకున్నార‌ని స‌మాచారం. ‘పిట్ట‌గోడ‌’ ద‌ర్శ‌కుడు అనుదీప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాకి క్లాప్ కొట్ట‌బోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com