మీరు విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నారు కదా? అని ఓ సినీ అభిమాని అనసూయను అడిగాడు. అంతే అనసూయ మనోభావాలు దెబ్బతిన్నాయి. అనసూయలో ఉన్న మేధావి బయటకు వచ్చారు. ‘ఐటెం ఏంటి? అసలు ఐటెం అంటే అర్థం ఏంటి? ఐటెం అంటే వస్తువు అని అర్థం. ఆడవాళ్ళు నీకు వస్తువులా కనబడుతున్నారా? మీ ఆనందం కోసం(?) స్పెషల్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తుంటారంతే. దయచేసి అలాంటి పాటలను ఐటెం సాంగ్స్ అని పిలవొద్దు’ అని తెగ ఆవేశపడిపోతూ లెక్చర్ దంచింది. ఒక్క అనసూయ అనే కాదు. బుల్లితెర నటీమణుల నుంచి, వెండితెర యాక్ట్రెస్ల వరకూ అందరిదీ ఇదే పంథా.
న్యూడ్ సీన్స్‌లో యాక్ట్ చేయడం గురించి అడిగినప్పుడు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కూడా ఓ రేంజ్లో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఎక్స్పోజింగ్ తప్పే కాదు, సెక్స్ సీన్స్‌లో నటించడం అస్సలు తప్పు కాదు అని చెప్తూ ఉంటారు. లిప్ కిస్సులు, బికినీలు, ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోవడాలు లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. రెమ్యూనరేషన్ తీసుకుని స్కిన్ షో చేయడం అంటే ప్రొఫెషన్లో భాగం అనుకోవచ్చు. కానీ ఫేస్ బుక్, ట్విట్టర్లలో హాట్ హాట్ ఫొటోస్‌ని, వీడియోస్‌ని పోస్ట్ చేయడాన్ని ఏమనాలి? శరీరాన్ని నమ్ముకుని బిజినెస్ చేసుకుంటున్న ఇలాంటి వాళ్ళే… తెలివితేటలతో అభివృద్ధిపథంలో దూసుకెళ్ళిపోతున్న మహిళలందరూ బాధపడేలా చేస్తున్నారు. స్త్రీ జాతి ఆణిముత్యాలం, స్త్రీల ఆత్మగౌరవం అని చెప్పే ఇలాంటి వాళ్ళే…. హార్డ్ వర్క్‌ని, ఇంటెలిజెన్స్‌ని నమ్ముకుని విజయాలు సాధిస్తున్న స్త్రీలను అవమానిస్తున్నారని కూడా అభ్యుదయ వాదులు చెప్తూ ఉంటారు. స్త్రీ జాతి ఔన్నత్యం, స్త్రీల మనోభావాలు లాంటి విషయాల గురించి స్కిన్ షోని నమ్ముకుని పేరు తెచ్చుకునేవాళ్ళందరూ ఎంత తక్కువ మాట్లాడితే స్త్రీ జాతికి అంత మంచిది అని మహిళా సంఘాల వాళ్ళు కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు. వీళ్ళకు ఆ విషయం ఎప్పుడు తెలిసొస్తుందో చూడాలి మరి.