ఏపీ ప్రభుత్వ రహస్య సమాచారం వైసీపీ నేతలకు చేరవేస్తోందెవరు..?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం దక్కని అధికారులు.. వైసీపీ ప్రభుత్వం వస్తే ..తమకు కీలక పదవులు దొరుకుతాయన్న ఉద్దేశంతో.. జగన్ సన్నిహితులతో టచ్‌లోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. సాక్షాత్తూ సీఎస్ కూడా..జగన్ వర్గానికి చెందిన అని ప్రచారం జరుగుతూండటం.. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలపై… వైసీపీకి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూండటంతో..  టీడీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఫలానా బిల్లులును ప్రభుత్వం చెల్లించాలనుకుంటోందని..వాటిని ఆపేయాలని విజయసాయిరెడ్డి మూడు రోజులుగా ట్వీట్లు చేస్తున్నారు. దీంతో బిల్లుల చెల్లింపుకు సంబంధించి వైసీపీ నేతలకు సమాచారం వెళుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏ బిల్లు ఎక్కడ ఉంది, ఎప్పుడు చెల్లింపులు జరగబోతున్నాయి, ఆ బిల్లు కోసం ఎవరకు అడుగుతున్నారు అనే సమాచారాన్ని కూడా ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్నారు.
సమాచారాన్ని బయటకు చేరవేస్తున్న లీక్ వీరుల గురించి టీడీపీ నేతలు పూర్తి సమాచారం సేకరించారు. జగన్ శిబిరంతో టచ్ లోకి వెళ్లిన సీనియర్ అధికారుల వివరాలు కూడా చంద్రబాబు చేరినట్లు టీడీపీ నేతలుచెబుతున్నారు. కొంతమంది ఐ.ఎ.యస్ అధికారులు, రెండు, మూడు జిల్లాల ఎస్పీలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమయింది. ముఖ్యంగా ఇద్దరు ఐపీఎస్ ఇరువురు అధికారులు జగన్ సన్నిహుతులైన కొంతమంది నేతలతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు.  ఓ జిల్లా ఎస్పీ వైసీపీ నేతలు  చేసిన దౌర్జన్యాల పై సరైన రీతిలో స్పందించడంలేదు. ఓ టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగినా.. నిందితులు ఎమ్మెల్యే అభ్యర్తి పేరు చెప్పినా కేసు నమోదు చేయలేదు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ తీసుకువెళ్లారు.
అయితే.. తమ ప్రభుత్వంపై ఉన్నత స్థాయిలో కుట్ర జరుగుతోందని నమ్ముతున్న టీడీపీ నేతలు.. ఈ సారి మాత్రం.. ఎవర్నీ ఉపేక్షించేది లేదని చెబుతున్నారు.  మొత్తానికి అధికారం వస్తుందో రాదో కానీ.. ఈసీ పుణ్యమా అని కొంత మంది అధికారులను తన వైపు తిప్పుకోగలిగింది వైసీపీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close