“అథెనా” కొనుగోలు సర్కస్..! రూ.4వేల కోట్లకు టెండర్..!?

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల తీరు అనేక అనుమానాలు కలిగిస్తోంది. వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని.. ఓ వైపు ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు పనికి రాని ప్లాంట్లు కొనాలని… అదే పనిగా ప్రయత్నాలు చేస్తూండటమే దీనికి కారణ. చత్తీస్‌ఘడ్‌లో.. అథెనా పేరుతో ఓ ధర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. నిర్వహణ పరంగా క్లిష్టమైన… ఉత్పత్తి పరంగా… పెద్దగా ఉపయోగపడని ఆ ప్లాంట్ నష్టాల్లో ఉంది. అప్పులతో బ్యాంకులు వేలం వేసే దిశలో ఉంది. అయితే.. అ ప్లాంట్‌ను కొనాలని.. ఏపీ జెన్కో పెద్దలు భావిస్తున్నారు. ఆ ప్లాంట్ అమ్మకానికి వచ్చిందని తెలిసి… దాన్ని కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మొన్నే వద్దనుకున్నారు..మళ్లీ కొనేందుకు కసరత్తు..!

నిజానికి రెండు నెలల కిందటే.. ఆ ప్లాంట్‌ను కొనాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ మాత్రం లాభదాయకం కాదని.. జెన్కోను మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప.. ఇంక దేనికీ ఆ కొనుగోలు ఉపయోగపడదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో.. అప్పటికి కొనుగోలు నిలిచిపోయింది. అయితే.. అనూహ్యంగా మళ్లీ.. ఇప్పుడా వ్యవహారం తెరపైకి వచ్చింది. ఎలాగైనా దాన్ని కొనాల్సిందేనన్న అభిప్రాయంతో అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అథెనాకు యంత్రాలు సరఫరా చేసిన చైనా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడామని.. ఆ యంత్రాలు గొప్పవని.. చెబుతున్నారని అందుకే కొనుగోలు చేద్దామని.. జెన్కోలోని కొంత మంది ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై మళ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రైవేటు విద్యుత్ ప్లాంట్ కొనాలనుకోవడం ఏమిటి..?

అసలు..  ఏపీకి సంబంధం లేని..ఎక్కడో చత్తీస్‌ఘడ్‌లో ఓ విద్యుత్ ప్లాంట్ అమ్మకానికి వస్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన… ఏపీ విద్యుత్ సంస్థలు కొనాలనుకోవడం ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు. అదేమైనా  ముఖ్యుల బినామీదా… దాన్ని ప్రజల సొమ్ముతో కొని.. వారికి లాభం చేకూర్చాలనుకుంటున్నారా.. అన్న అనుమాలు కలిగేలా… విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. నిజానికి ప్రైవేటు ప్లాంట్లను… ఏపీ విద్యుత్ సంస్థలు కొనుగోలు చేయవు. మహా అయితే.. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఇక్కడ అసలు ప్లాంటే కొనాలని ప్లాన్ వేస్తున్నారు.

అసలు ఈ అథెనా ఎవరిది..?

అసలు ఈ అథెనా విద్యుత్ ప్రాజెక్ట్‌పై.. ఏపీ విద్యుత్ సంస్థలు ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నాయన్నది చాలా మందికి ఆర్థం కావడం లేదు. ఈ ధర్మల్ ప్లాంట్ అథెనా చత్తీస్‌ఘడ్ పవర్ లిమిటెడ్ సంస్థది.  ఆ సంస్థ 2007లో .. హైదరాబాద్‌లో రిజిస్టర్ అయింది. అప్పట్లో డైరక్టర్లు..యజమానులు ఎవరో కానీ.. ప్రస్తుతం క్రొవ్విడి శ్రీనివాస్ డైరక్టర్‌గా ఉన్నారు. ఈయన 2015 నుంచి మాత్రమే డైరక్టర్‌గా ఉన్నారు. తర్వాత 2017లో దీపక్ మిశ్రా, అభయ చింతమన్ చౌదరి అనే ఇద్దర్ని నామినీ డైరక్టర్లుగా తీసుకున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది.. ఇలాంటి సమయంలో.. డైరక్టర్లను మార్చారు. ఇప్పుడు.. ఈ ప్లాంట్‌ను కొనాలని.. విద్యుత్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీనికి మొత్తం రూ. 4వేల కోట్ల వరకూ అవుతుంది.  కొసమెరుపేమిటంటే.. రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని అమ్మకానికి వెళ్తోంది…కానీ.. అదే ధర్మల్ ప్లాంట్ అయిన అథెనాను కొనుగోలు చేయాలని ఉత్సాహం చూపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close