అమరావతి రైతుల దీక్షలకు రాహుల్ గాంధీ ..!?

అమరావతి ఉద్యమాన్ని మరో  స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలను చాలా గట్టిగానే చేస్తున్నారు. వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ మద్దతిస్తూండటంతో… జాతీయ స్థాయి నాయకుల్ని పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను వ్యతిరేకిస్తోంది. అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో.. ఏపీ కాంగ్రెస్‌కు కొత్తగా నియమితులైన కార్యవర్గం.. కొత్త పీసీసీ చీఫ్ శైలజానాథ్…అమరావతికి మద్దతుగా తమదైన ముద్రతో ఓ పోరాట ప్రణాళిక ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా… రాహుల్ గాంధీని అమరావతికి తీసుకు రావాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. తాను వస్తానని భరోసా ఇచ్చారు.

రాహుల్ గాంధీ పర్యటనతో… అమరావతి పోరాటం… జాతీయ స్థాయికి చేరుతుందన్న అభిప్రాయంతో.. ఉద్యమకారులు ఉన్నారు. అందుకే.. వీలైనంత త్వరగా రాహుల్ పర్యటనను ఖరారు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాల మధ్యలో రాహుల్ .. రావడం కుదరదన్న అంచనాలో.. ఏపీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. ఆ సమావేశాలు ముగిసిన తర్వాత.. తొలి వారంలోనే పర్యటన ఖరారు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీని కోసం అమరావతి జేఏసీతో కాంగ్రెస్ నేతలు సమన్వయం చేసుకునే అవకాశం ఉంది.

ఒకటో తేదీన అమరావతి జేఏసీ ఢిల్లీ పర్యటనకు వెళ్తోంది. మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ల కోసం.. గతంలో వీరు ప్రయత్నించారు. ఆ అపాయింట్‌మెంట్ల విషయంలో… పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. కదలిక వచ్చే అవకాశం ఉందంటున్నారు. మోదీ, అమిత్ షాలకు ఉన్న వెసులుబాటుని బట్టి… సమయం ఇవ్వొచ్చన్న సమాచారం రావడంతో.. వారు ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడే రాహుల్ గాంధీని కూడా కలిసి.. లాంఛనంగా.. అమరావతికి రావాలని ఆహ్వానించే అవకాశం ఉందంటున్నారు. రాహుల్ గాంధీ అమరావతి పర్యటనకు వస్తే.. విషయం.. జాతీయ స్థాయికి చేరే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close