ఏడాది యాత్ర 8: సంపద సృష్టించలేక ఆస్తులు అమ్మి పాలన..!

“భూములమ్ముతున్నారు… ప్రభుత్వం ఏమైనా దివాలా తీసిందా..?” అని హైకోర్టు మొహం మీదనే ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ డౌట్ హైకోర్టుకు మాత్రమే కాదు.. సామాన్య ప్రజలకూ వస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వం అడ్డగోలుగా మార్కెట్లు, క్వార్టర్లు సహా.. ప్రజావినియోగంలో ఉన్న స్థలాలను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం.. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అదే పని చేస్తోంది. గంటూరు పట్టణంలో ఉండే జనం మొత్తం కూరగాయలు కొనుక్కునే మార్కెట్‌ను వేలంలో పెట్టేశారంటే… దేన్నీ వదిలి పెట్టరని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం సంపద సృష్టించి ఖర్చు పెట్టడం భావ్యం. కానీఈ ప్రభుత్వం సంపద సృష్టిపై దృష్టి పెట్టలేదు కానీ.. ఖర్చుల కోసం మాత్రం ఆస్తులు అమ్మేస్తోంది. రాష్ట్రాన్ని దాదాపుగా దివాలా దిశగా తీసుకెళ్తోంది.

ఏడాదిలో సంపద సృష్టి ప్రయత్నాలు నిల్..!

ఏడాదిలో ప్రజల జీడీపీ పెరగలేదు. కానీ తగ్గింది. ఏడాదిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టలేదు. ఏడాదిలో కొత్త పరిశ్రమలు రాలేదు. ప్రభుత్వం సంపద సృష్టిస్తేనే జీడీపీ పెరుగుతుంది. పోలవరం సహా రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే రైతులకు కావాల్సినన్ని నీళ్లు అందుతాయి. పరిశ్రమలకు నీటి కొరత తీరుతుంది. ఈ నీరు అందుబాటులో ఉండటం వల్ల పంటలు పండుతాయి. పరిశ్రమలు వస్తాయి. వీటి ద్వారా ప్రజల ఆదాయం అమాంతం పెరుగుతుంది. అంటే.. జీడీపీ పెరుగుతుంది. అదే అసలైన అభివృద్ధి. అదే అసలైన సంపద సృష్టి. ప్రభుత్వం ఏడాదిలో ఈ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. పోలవరం పూర్తి చేస్తే.. ఈ పాటికి గ్రావిటీ ద్వారా రైతులకు నీరు అందించే అవకాశం ఉండేది. కానీ కాంట్రాక్టర్ మార్పుతో మొత్తం పడకేసింది. ప్రాజెక్టుల మీద కానీ.. మరో మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ మీద కానీ పెట్టలేదు. సంక్షేమ పథకాల పేరుతో మెజార్టీ నిధులను పంచేసింది. ఒక్క ఏడాదిలో రూ. 42వేల కోట్లను పంచేశానని ముఖ్యమంత్రి కూడా ఘనంగా ప్రకటించారు. అంటే.. ప్రజలకు నేరుగా లబ్ది కలిగించే ప్రయత్నాలకే పెద్ద పీట వేశారు కానీ.. ఆ ప్రజల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు మాత్రం చేయలేదు.

రాజకీయం కోసం రూ. 10లక్షల కోట్ల అమరావతి హారతి కర్పూరం..!

అమరావతిని తరలిస్తే పది లక్షల కోట్లు ఆవిరవుతాయని చంద్రబాబు బాధపడుతున్నారు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ ఉంటారు. అంటే.. వైసీపీ నేతల అంచనా ప్రకారం అమరావతి విలువ పది లక్షల కోట్లు. అమరావతి కట్టకపోతే… అమరావతిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తే… వచ్చే నష్టం పది లక్షల కోట్లన్నమాట. ఈ నష్టం ఎవరికి వస్తుంది..? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికా..? తెలుగుదేశం పార్టీకా..? ఓ సామాజికవర్గానికా..?. ఆ నష్టం జరిగేది.. ఆంధ్రప్రదేశ్‌కి అని. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అని. రాజధాని కడితే.. అక్కడ భూముల విలువ పెరగడం వల్ల రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూంటారు. అమరావతికి చేసే అప్పులు దానితో తీరిపోవడమే కాక.. ఇంకా మిగులుతాయని కూడా చెబుతూంటారు. మిగతా ఎనిమిది లక్షల కోట్లు… ప్రజల సంపద. అమరావతి నిర్మాణం వల్ల… ఆ చుట్టుపక్కల పెరిగే భూముల ధరలు… వచ్చే పరిశ్రమల వల్ల పెరిగే సంపద.. ఈ సంపద అంతా పెరిగేది ప్రజలకే. ఇలా అన్నీ కలిపితే…ఐదేళ్ల కాలంలో పది లక్షల కోట్ల సంపద ఆంధ్రప్రదేశ్‌కు అంటే.. ప్రజలకు జమ అయ్యి ఉండేది. కానీ అన్నీ తెలిసిన ప్రభుత్వం మాత్రం.. ఆ పది లక్షల కోట్ల సంపద సృష్టిని నిర్మోహమాటంగా కాల దన్నేసి… అమరావతిని నిర్వీర్యం చేయాలని నిర్ణయించుకుంది.

రాష్ట్రానికి పెను ముప్పు తెస్తున్న అప్పుల భారం..!

ఆంధ్రప్రదేశ్ ఆదాయం… అటూ ఇటుగా.. 70, 80 వేల కోట్లు మాత్రమే. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, తీసుకొచ్చే అప్పుల మీద బడ్జెట్ బండిన రెండు లక్షల కోట్లను దాటించేస్తారు. ఆదాయ వనరులు ఇంత పరిమితంగా ఉన్న రాష్ట్రానికి… కావాల్సింది సంపద సృష్టించే పాలన. కానీ ఎదురుగా కనిపిస్తున్న సంపద సృష్టి మార్గాలైన పోలవరం, అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను … క్షణం ఆలోచించకుండా.. కూలగొట్టేయమని సీఎం ఆదేశించినప్పుడే.. ప్రజాసంపదపై.. ఆయనకు పెద్దగా పట్టింపు లేదన్న అభిప్రాయం.. అందరిలోనూ వినిపించింది. ఆ తర్వాత సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రాష్ట్ర ఆర్థిక మూలాలను బలహీనం చేసేవిలానే ఉన్నాయి. పీపీఏల రద్దు నుంచి అమరావతి తో పాటు .. ఇతర నిర్ణయాల వల్ల.. విదేశీ పెట్టుబడిదారులెవ్వరూ ఏపీ వైపు చూసే పరిస్థితి లేదు. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచాల్సిన సీఎం… మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో గందరగోళాన్ని పెంచేశారు. ఫలితంగా ఇప్పుడు… ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది…

గతంలోనూ ముఖ్యమంత్రులు ఆస్తులు అమ్మారు.. కానీ సృష్టించిన సంపద అమ్మారు..!

ఏడాది పాలన తర్వాత ఆస్తులు అమ్మేసే పరిస్థితికి ఏపీ సర్కార్ వచ్చింది. ఇదేమిటని వస్తున్న విమర్శలకు గత ప్రభుత్వాలు అమ్మలేదా అని వితండవాదం చేస్తున్నారు. నిజమే.. గతంలో చంద్రబాబు, వైఎస్ సహా ఎంతో ముఖ్యమంత్రులు అమ్మారు. వాళ్లు మార్కెట్లు… ఉద్యోగుల క్వార్టర్లు అమ్మలేదు. సంపద సృష్టించి.. దాన్ని అమ్మారు. చంద్రబాబు హైటెక్ సిటీ ఆలోచనలతో.. హైదరాబాద్ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకూ భూముల విలువను పెంచి.. వాటిని సంపదగా మార్చారు. రాజశేఖర్ రెడ్డి వాటిని అమ్మారు. అలాగే… చంద్రబాబు అమరావతిని సంపద సృష్టి కేంద్రంగా చేసి అమ్మాలనుకుని.. ప్రజల ఆదాయాన్ని పెంచాలనుకున్నారు. కానీ కూరగాయల మార్కెట్లు అమ్మాలనుకోలేదు. అక్కడే తేదా. ఆలోచనల్లోనే దివాలా తనం కనిపిస్తోందని.. ఊరకనే విమర్శలు రావుగా. ఇప్పటికే అయింది ఏడాది మాత్రమే. ప్రభుత్వం ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంటే రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది..లేకపోగా బలయ్యేది ప్రజల ఆర్థిక పరిస్థితే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close