‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ ‘క్లాప్’ కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి లోబ‌డి చిత్రీక‌ర‌ణలు జ‌రుపుకోవాల్సి వుంటుంది. అయితే ఈలోగా… టాలీవుడ్ కూడా ఓ గైడ్ లైన్స్ రూపొందించుకుంది. త‌మ ప్ర‌తిపాద‌న‌ల్ని, షూటింగ్ చేసుకునే ప‌ద్ధ‌తుల్ని రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌నూ నివేదించ‌బోతోంది. ఈరోజు ఉద‌యం అన్న‌పూర్ణ స్టూడియోలో ద‌ర్శ‌క నిర్మాత‌ల కీల‌క భేటీ సాగింది. రాజ‌మౌళి, బోయ‌పాటి శ్రీ‌ను, కొర‌టాల శివ‌, డివివి దాన‌య్య‌, అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు లాంటి ప్ర‌ముఖులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

లాక్ డౌన్ నిబంధ‌లకు లోబ‌డే షూటింగులు ఎలా జ‌రుపుకుంటామో తెలుపుతూ.. ఓ డెమో వీడియోని రూపొందించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఆ వీడియో ఎలా ఉండాలి అనే విష‌యాల‌తో పాటు, ముఖ్య‌మంత్రుల దృష్టి కి ఎలాంటి విష‌యాలు తీసుకెళ్లాలి? చిత్ర‌సీమ‌ మేలు కోసం ఎలాంటి క‌మిట్‌మెంట్స్ తీసుకోవాల‌నే విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. ఇప్ప‌టికే కేసీఆర్ తో చిత్ర‌సీమ ఓ సారి భేటీ అయ్యింది. ఇప్పుడు మ‌రో ద‌ఫా కేసీఆర్‌ని క‌ల‌వ‌బోతోంది. దాంతో పాటు.. జ‌గ‌న్‌తోనూ స‌మావేశం అవ్వ‌బోతోంది చిత్ర‌సీమ‌. అందుకు సంబంధించిన అపాయింట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో కేసీఆర్‌తో ఓ సమావేశం జ‌ర‌గ‌బోతోంది. జ‌గ‌న్‌తో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడే అవ‌కాశం ఉంది. ముఖ్య‌మంత్రుల కూడా చిత్ర‌సీమ విష‌యంలో సానుకూలంగా స్పందింస్తార‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లంతా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఈ గైడ్ లైన్స్ విష‌యంలో ముఖ్య‌మంత్రుల స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐపీఎల్ స్టోరీస్‌: విరాట్ కి ఏమైంది?

విరాట్ కోహ్లీ.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ బ్యాట్స్‌మెన్‌. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా, ఫార్మెట్ ఏదైనా - బౌల‌ర్ల‌పై భీక‌రంగా విరుచుకుపోవ‌డ‌మే త‌న‌కు తెలుసు. ఐపీఎల్ అంటే.. మ‌రింత చెల‌రేగిపోతాడు. ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగులు...

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

HOT NEWS

[X] Close
[X] Close