హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు చేసిన కుట్రను ఇంటలిజెన్స్ అధికారులు నిర్వీర్యం చేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. . హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరిలో ఏపీ వ్యక్తి ఒకరు ఉన్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ ఓ ఐసిస్ మాడ్యూల్ సాయంతో పేలుళ్లకు పాల్పడ్డాలని నిర్ణయించారు.
విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్ హైదరాబాద్‌కు తీసుకు వచ్చాడు. సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్. చేశారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ కు ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చారు. సమాచారం స్పష్టంగా ఉండటంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఇద్దర్నీ పట్టుకుంది.
మరో వైపు పాకిస్తాన్ లో లష్కరే తోయిబా టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం అయ్యారు. ఈయన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్నారు. భారత్‌లోని నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరులో దాడులకు అతడే సూత్రధారిగా భారత ప్రభుత్వం భావిస్తోంది. భారత హిట్ లిస్టులో ఉండటంతో ఆపరేషన్ సిందూర్ అనంతరం సైఫుల్లాకి పాక్ ప్రభుత్వం భద్రత కల్పించింది. పాక్‌లోని సింధ్ రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సైఫుల్లా మృతి చెందాడు.