“అప్పు” అంటే రెడీ అంటున్న ఏపీ సర్కార్..!

విదేశీ సంస్థ ఇస్తామంటున్న అప్పు తీసుకుంటే తప్పేమిటని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎదురుదాడి చేస్తున్నారు. అయితే.. అసలు అప్పు ఇస్తామన్న సంస్థ పేరు బయట పెట్టడానికి మాత్రం ఆయన నిరాకరించారు. విదేశీ సంస్థ 9 బిలియన్ డాలర్లు ఏపీ ప్రభుత్వానికి అప్పు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని.. దానికి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలంటూ… బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి సహా కీలక వ్యక్తులందర్నీ కలిశారు. తాము రాష్ట్రానికి నిధులు అడిగేందుకు వెళ్లామని.. మీడియాకు చెప్పారు కానీ.. అసలు వారు వెళ్లింది … విదేశీ సంస్థ నుంచి తీసుకునే అప్పు కోసం .. గ్రీన్ సిగ్నల్ పొందడానికని ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిపై మీడియాలో సైతం విస్తృతంగా కథనాలు రావడంతో.. అప్పు తీసుకుంటే తప్పేమిటనే వాదనను.. బుగ్గన తెరపైకి తీసుకు వచ్చారు.

అప్పు ఇస్తామన్న విదేశీ సంస్థ పేరు చెప్పని బుగ్గన..!

ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థ వద్ద అప్పు తీసుకోవాలనుకోవడం తప్పు కాదు.. కానీ.. నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకోవడం మాత్రం తప్పే. నిబంధనలు అంగీకరించవని తెలిసి కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… తప్పేమిటనే వాదనను మీడియా ముందుకు తెస్తున్నారు. అసలు కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సంస్థలన్నీ.. ఆచితూచి అడుగులేస్తున్నాయి. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ముదూ వెనుకా చూసుకోకుండా..సంస్థలు రుణాలివ్వడం లేదు. కానీ ఏపీ సర్కార్‌కు మాత్రం రూ. 9 బిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఓ సంస్థ ముందుకు రావడం ఆశ్చర్యమే. కానీ ఆ సంస్థ పేరును మాత్రం బయట పెట్టడం లేదు.

అధికారవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం..ఆ సంస్థ పేరు “సీఐజీ క్యాప్”

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉన్న CIGCAP అనే సంస్థ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఇస్తామని ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి లోన్ ఇప్పిస్తానని.. ఓ మధ్యవర్తి.. ఇప్పుడు సచివాలయంలో హల్ చల్ చేస్తున్నారంటున్నారు. సీఎంవోలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారి అండదండలు.. ఆ వ్యక్తికి ఉన్నాయంటున్నారు. ఈ సీఐజీక్యాప్ సంస్థ.. ప్రాజెక్ట్ ఫైనాన్షింగ్ మోడల్‌లో పని చేస్తోంది. నేరుగా అప్పులు ఇచ్చే సంస్థ కాదు. ఏదైనా ఓ ప్రాజెక్ట్ అనుకుంటే… ఆ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి పెడుతుంది. దానికి తగ్గట్లుగా వడ్డీతో వసూలు చేసుకుంటుంది. అయితే.. ఈ సంస్థ వేల కోట్లు… పెట్టుబడులు పెడుతుందా.. దానికి అంత సామర్థ్యం ఉందా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి.

. వేల కోట్ల రుణం ఇచ్చే సామర్థ్యం లేని కంపెనీ..!

ఏపీ ప్రభుత్వానికి రూ. 9 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపుగా రూ. అరవై ఐదు వేల కోట్లు సీఐజీక్యాప్ సంస్థ ఇస్తామంటోందని చెబుతున్నారు కానీ.. నిజానికి ఆ సంస్థ ఎప్పుడూ ఆ స్థాయిలో ప్రాజెక్ట్ ఫండింగ్ చేయలేదు. ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మాత్రమే.. ఆ సంస్థ ఇప్పటి వరకూ ఫండింగ్ చేసింది. అంతకు మించి భారీ ప్రాజెక్టులు చేపట్టిన దాఖలాలు లేవు. నేరుగా ప్రభుత్వాలకు నగదు బదిలీ రూపంలో రుణం ఇచ్చే అవకాశం లేదు. మరి ఏపీ సర్కార్.. ఏ ప్రాజెక్ట్ కోసం రూ. అరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకోవాలనుకుంటుందో క్లారిటీ లేదు. మొత్తానికి విదేశీ ప్రైవేటు అప్పు వ్యవహారం.. ముందు ముందు మరింత రాజకీయం అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close