ఇంజినీరింగ్ ఫీజులూ మార్చలేకపోయిన ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ఫీజుల్లో మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఫీజుల ఉత్తర్వల జీవో నిలిపివేతను.. సుప్రీంకోర్టు సమర్థించింది. 2019-20 విద్యా సంవత్సరానికిగాను ఎఎఫ్‌ఆర్‌సి సూచించిన విధంగానే ఇంజినీరింగ్‌ ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్య ఫీజుల్లో మార్పులు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీ నియమించింది.ఆ కమిటీ వివిధరకాల పరిశీలనలు జరిపి ఫీజులు ఖరారు చేసింది. అయితే.. ఇంజినీరింగ్ యాజమాన్యాలు.. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ 2019 నుంచి 2022 విద్యాసంవత్సరాలకు గతంలో ఫీజులు సిఫార్సు చేసిందని.. ఆ గడువు పూర్తి కాకుండా.. కొత్త ఫీజులు నిర్ణయించడం కరెక్ట్ కాదని కోర్టుకెళ్లాయి.

ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం చట్ట విరుద్ధమన.ి. ఇంజినీరింగ్ కాలేజీలు వాదించాయి. మొదట… వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ జీవోను నిలిపివేస్తూ.. ఎఎఎఫ్‌ఆర్‌సీ సిఫారసుల మేరకే ఫీజులు వసూలు చేయాలని ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనే డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేసింది. దీంతో డివిజన్ బెంచ్.. తీర్పులో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తీర్పును .. 23 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. 2019-20 నుంచి మూడేళ్లకు ఏఎఫ్ఆర్‌సీ సిఫారసు చేసిన ఫీజులనే అమలు చేయాలని కోరాయి. సుప్రీంకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో.. ప్రభుత్వం ఆదేశించిన కొత్త ఫీజులు అమలు చేయడం సాధ్యం కాదు.

వైసీపీ సానూభూతి పరులకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యధిక ఫీజులు.. ఇతరుల కాలేజీల్లో తక్కువ ఫీజులను ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయించిందని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆరు కాలేజీల్లో మాత్రమే.. గరిష్ఠంగా రూ.70వేలు ఫీజు ఖరారు చేశారు. శ్రీవిద్యానికేతన్‌ , , పీవీపీ సిద్ధార్థ , జీపీఆర్‌ కర్నూలు వంటి కాలేజీలకే చాన్స్ దక్కింది. ప్రసిద్ధమైన ఇతర కాలేజీలకూ.. తక్కువ మొత్తంలో ఫీజు ఖరారు చేశారు. ఇప్పుడు వాటిని సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గత ఏడాది ఫీజులనే వసూలు చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close