ఐటి పరిశ్రమకు 8 చట్టాలనుంచి ఎపి మినహాయింపు

* ఐటీ పరిశ్రమకు ఎపి భారీ రాయితీలు
* 8 చట్టాల నుంచి మినహాయింపు – సబ్సిడీలే సబ్సిడీలు
* మూడు నాలుగేళ్ళలో లక్షమంది కి జాబ్ లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ పరిశ్రమలకు భారీగా రాయితీలు ప్రకటిచడంతో దేశంలోని పలుప్రముఖ సంస్థలతోపాటు మల్టీనేషనల్ కంపెనీలు కూడా రాష్ట్రంలో తమ కేంపస్ లను ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఈ గవర్నెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల విషయంలో ఏపీ అనేక ఇతర రాష్ట్రాలకంటే ముందు వుంది. దానికి తోడు ఐటీ ఇండస్ట్రీకి కావలసిన మానవవనరులకు లేదా ఐటీ నిపుణులకు ఇక్కడ కొదవలేదు.

ఒకప్పుడు హైటెక్ బాబు అని హేళనలతో చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడిన నాయకులు ఇపుడు ఆ విషయం పెద్దగా మాట్లాడటం లేదు. వారిలో హెచ్చమంది పిల్లలు ఆ రంగలో స్ధిరపడిన వాస్తవమే ఇందుకు కారణం. టెక్నాలజీతో ముందుకి పోవడం ఇపుడు ప్రపంచ లక్షణం. దాన్ని అందిపుచ్చకోలేని వారు వెనకబడిపోతారు. దీన్ని గుర్తించి అంది పుచ్చుకోగలిగిన వారు విజనరీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఐటి పాలసీ అమలులోకి వస్తే నిరుద్యోగం తగ్గుతుంది. ఐటిలో నైపుణ్యాలు పెరుగుతాయి.

ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో 200 ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు ఐటీ, కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ తో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ ఇన్ స్టిట్యూషన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దాంతో ఆధునిక సాంకేతిక అంశాలతో కూడిన ఉన్నత విద్యతోపాటు ఈ పరిశ్రమకు కావలసిన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో కూడిన ఐటీ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2020 వరకూ అమలులో వుంటుంది.

టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఐటీ పరిశ్రమకు ఉపయోగపడే విధంగా సిలబస్ లో మార్పులు చేయాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు సలహా ఇచ్చింది. ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారయ్యేవిధంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించింది. గుర్తించిన ఆన్ లైన్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు క్రెడిట్స్ కూడా ఇవ్వమని సలహా ఇచ్చింది. తగిన ఫ్యాకల్టీని సమకూర్చుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పింది.

విదేశీ విశ్వవిద్యాలయాలు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సహకారంతో ప్రారంభించే ఐటీ ఇన్ స్టిట్యూట్స్ కు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుంది. సాఫ్టవేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివే విద్యార్థులకు నాలుగవ సంవత్సరంలో సంబంధిత పరిశ్రమలలో ఇంటర్మ్ షిప్ చేయడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో పరిశ్రమల సహకారం తీసుకోవాలని సూచన చేసింది. ఐటీ పరిశ్రమ వృద్ధిలో ‘ఇన్నొవేషన్’ కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త తరహా ఉత్పత్తుల ద్వారానే ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ పరిశ్రమ రాష్ట్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పారిశ్రామికవేత్తల సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక మినహాయింపులు ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశ్రమకు ఏపీ కాలుష్య నియంత్రణ చట్ట పరిధి నుంచి మినహాయించారు. ఈ పరిశ్రమనుఫ్యాక్టరీస్, మెటర్నిటీ బెన్షిట్, ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్, కాంక్ట్రాక్ట్ లేబర్, పేమెంట్ ఆఫ్ వేజెస్, మినిమమ్ వేజెస్, ఎంప్లాయిమెంట్ క్ఛ్సేంజెస్ చట్టాల నుంచి మినహాయించారు. అలాగే ఐటీ యూనిట్లు సూచించిన ఫార్మేట్ లో స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. మహిళా ఉద్యోగుల భద్రతకు, రక్షణకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని నైట్ షిఫ్ట్ తోపాటు మూడు షిఫ్ట్ లలో పని చేయించుకోవడానికి అవకాశం కల్పించారు. ఐటీ, ఐటీఇఎస్ యూనిట్లను, కంపెనీలను, ప్రమాదకరం కాని హార్డ్ వేర్ ఉత్పత్తి యూనిట్లను ఏపీ ఎసెన్సియల్ సర్వీసెస్ మెయింట్ నెన్స్ యాక్ట్ కింద తప్పనిసరి సర్వీసులుగా ప్రభుత్వం ప్రకటించింది.

కంపెనీ పేరు ప్రతిష్టలు, ఆ కంపెనీ పెట్టే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది. కనీసం వంద మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పించే యూనిట్ కు మాత్రమే భూమిని కేటాయిస్తారు. 500 మంది ఐటీ నిపుణులకు ఉపాధి కల్పిస్తే ఒక ఎకరా వరకు రిబేటుపై భూమిని కేటాయించే అవకాశం ఉంది. కంపెనీ ప్రతిపాదించే అంశాల ఆధారంగా ప్రభుత్వం నియమించే కమిటీ భూమి కేటాయింపు అర్హతలను నిర్ధారిస్తుంది. కంపెనీని ఎప్పటిలోపల ప్రారంభించేది, ఎంతమందికి ఉపాధి కల్పించేది, ఎంత పెట్టుబడి పెట్టేది అన్ని వివరాలు ఒప్పందంలో ఉంటాయి. ఆ ఒప్పంద పత్రాలపై ఆ కంపెనీ అధికార ప్రతినిధి సంతకం చేస్తారు. ఉపాధి కల్పన ఆధారంగా ఐటీ లేఅవుట్స్, ఐటీ టవర్స్ లో మరో ఐటీ కంపెనీకి సబ్ లీజింగ్ ఇవ్వడానికి కూడా అనుమతిస్తారు.

ఐటీ పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల మొదటి సేల్ డీడ్ లు, లీజ్ డీడ్ లకు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ వంద శాతం రీఇంబర్స్ మెంట్ ఉంటుంది. రెండవ సారి అయితే 50 శాతం రీయింబర్స్ మెంట్ ఉంటుంది. ఎంఎస్ఎంఇ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) కింద స్థాపించే ఐటీ యూనిట్స్ కు విద్యుత్ బిల్లు చెల్లింపులో 25 శాతం సబ్సిడీ ఉంటుంది. యూనిట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాలు గానీ, రూ.30 లక్షల రూపాయల వరకు గాని ఏది ముందైతే అప్పటి వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అదే ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే ఐటీ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. అయిదు సంవత్సారాల వరకు గానీ లేదా రూ.50 లక్షల రూపాయల వరకు గానీ ఏదీ ముందేతే అప్పటి వరకు సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇండస్ట్రియల్ టారిఫ్ నుంచి కూడా కొత్త ఐటీ, ఐటీఈఎస్ యూనిట్స్ కు 5 సంవత్సరాల వరకు వంద శాతం మినహాయింపు ఇస్తారు. ఐటీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీలో ఉంటే ఆ కంపెనీ పేటెంట్ (మేథోసంపత్తి హక్కు) కోసం ఖర్చు చేసే మొత్తాన్ని రీయింబర్స్ చేస్తారు. అయితే దేశీయంగా అయితే రూ. 5 లక్షల వరకు, అంతర్జాతీయంగా అయితే రూ.10 లక్షలవరకూ వరకు పరిమితి విధించారు. క్వాలీటీ సర్టిఫికేషన్స్ పొందటానికి అయ్యే ఖర్చులో కూడా ఐటీ యూనిట్స్ కొన్ని పరిమితులకు లోబడి 20 శాతం వరకు రీఇంబర్స్ మెంట్ పొందవచ్చు.

ఐటీ పరిశ్రమకు ఉపయోగపడే పరిశోధనలు, మార్కెటింగ్ సర్వేలు వంటి వాటిని నిర్వహించే ఐటీ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్స్, ఐటీఎస్ఏపీ, నాస్కామ్(ఎన్ఏఎస్ఎస్ సీఓఎం), ఇఎల్ఐఏపీ, ఎస్ టీపీఐ, ఐఇజీ వంటి ఏ ఇతర సంస్థలకైనా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది. ఈ పరిశ్రమకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఎగ్జిబిషన్స్ వంటివాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా సందర్భానుసారం రోడ్డు షోలు, ఇతర ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతుంది.

ఐటీ పరిశ్రమలో పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అత్యధికంగా పెట్టుబడి పెట్టి, అయిదు సంవత్సారాల లోపు అయిదు వేల మందికి ఉపాధి కల్పించేవారికి ఇటువంటి ప్రోత్సాహకాలు ఇస్తారు. పరిశ్రమ పెట్టడానికి స్థలాన్ని లేక భవనాన్ని లీజుకు లేక అద్దెకు తీసుకుంటే కొన్ని నిబంధనలకు లోబడి మూడు సంవత్సరాల పాటు అద్దె సబ్సిడీ ఇస్తారు. అలాగే మెగా ఐటీ ప్రాజెక్టులకు పది శాతం ఇన్ వెస్ట్ మెంట్ సబ్సిడీ కూడా ఇస్తారు.

ఇవే కాకుండా ఎంఎస్ఎంఇ ఐటీ యూనిట్స్ కు ప్రభుత్వం అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. నిబంధనలకు లోబడి అద్దె సబ్సిడీ 50 శాతం, మార్కెట్ డెవలప్ మెంట్ కు చేసే ఖర్చులో 50 శాతం రీఇంబర్స్ మెంట్ ఇస్తారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఇంకా అనేక రాయితీలను ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్ డెవలప్ మెంట్ కు చేసే ఖర్చు వారికి వంద శాతం రీయింబర్స్ మెంట్ చేస్తారు. నిర్వహించిన వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా వారికి గ్రాంట్ కూడా ఇస్తారు. వడ్డీ సబ్సిడీ ఇస్తారు. కేటాయించే భూములు, భవనాలలో కొంత భాగాన్నివారికి రిజర్వు చేశారు.
ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఆర్థిక, ఆర్థికేతర సహాయ సహకారాలు ప్రకటించడంతోపాటు సింగిల్ విండో విధానం ద్వారా ఐటీ ప్రాజెక్టులకు కూడా కావలసిన పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే 21 రోజులలో అనుమతి ఇస్తారు.

ఈ అవకాశాలను దృష్టిలోపెట్టుకుని రాష్ట్రంలో మెగా ఐటీ ప్రాజెక్టులు, యూనిట్ల స్థాపనకు అధిక మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలతో రాబోయే రెండు మూడేళ్లలోనే ఐటీ ఇండస్ట్రీ విస్తృత స్థాయిలో విస్తరించి లక్ష మంది ఐటీ నిపుణులకు ఉపాధి లభించే అవకాం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్ : ఆ లేడీ పోలీస్ నిత్య పెళ్లి కూతురు..!

పోలీస్‌కు క్రిమినల్ ఆలోచనలు రావాలి. ఎందుకంటే.. క్రిమినల్స్‌ని పట్టుకోవాలి కాబట్టి. కానీ ఆ క్రిమినల్ పనులు చేయాలనుకుంటే మాత్రం మొత్తం పరిస్థితి తేడా వస్తుంది. అసలే పోలీస్.. ఆపై క్రిమినల్ పనులంటే ఇక...

ఒక్క రోజు అసెంబ్లీకి టీడీపీ దూరం..!

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. బడ్జెట్ ఆమోదించుకోవడం కోసం ఒక్క రోజు సమావేశం పెట్టాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇరవై తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్క రోజే గవర్నర్...

బడ్జెట్ : గత ఏడాది ఆదాయం కన్నా రూ. లక్ష కోట్ల ఎక్కువ ఖర్చు..!?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత..? ఈ ప్రశ్న కన్నా ముందు గత ఏడాది ఎంత ఆదాయం వచ్చింది..? ఎంత ఖర్చు పెట్టాం..? ఎంత లోటు ఉంది అన్నది కూడా లెక్కలేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే.....

ఆ సమస్యను చిటికెలో పరిష్కరించిన కేటీఆర్..!

తెలంగాణ మంత్రి కేటీఆర్.. కోవిడ్ టాస్క్ ఫోర్స్‌కు చైర్మన్ అయిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా చురుగ్గా కదులుతున్నారు. తాజాగా సమ్మెకు వెళ్తామని ప్రకటించిన జూనియర్ డాక్టర్లను ఆయన శాంత పరిచారు. కొద్ది...

HOT NEWS

[X] Close
[X] Close