జ‌న‌తాలో .. జై బాల‌య్య‌

జ‌న‌తా గ్యారేజ్ హంగామా ఓ రేంజులో సాగుతోంది. అర్థ‌రాత్రి ప్రీమియ‌ర్ షోల్లో క‌నిపించిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాకెప్పుడూ లేని స్థాయిలో.. ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేశారు. హైద‌రాబాద్‌లో దాదాపు 10 థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ షోలు వేశారు. ప‌ది చోట్లా హౌస్ ఫుల్సే. స‌రిగ్గా అర్థరాత్రి 3 గంట‌ల‌కు షోలు ప‌డిపోయాయి. థియేట‌ర్ల‌లో మాత్రం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన గోల అంతా ఇంతా కాదు. అయితే.. అదే స‌మ‌యంలో థియేట‌ర్లో అనూహ్యంగా జై.. బాల‌య్య నినాదాలూ మిన్నంటాయి. ఓ సంద‌ర్భంలో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. – జై ఎన్టీఆర్ అనీ, ఇటు బాల‌య్య ఫ్యాన్స్ జై.. జై బాల‌య్య అంటూ.. అరుపుల‌తో థియేటర్‌ని మోతెక్కించారు. చూస్తుంటే ప‌రిస్థితి ఉదృతంగా మారేట్టే క‌నిపించింది. కానీ.. మ‌ళ్లీ.. ‘ఒక్క‌టే ఒక్క‌టే.. మ‌న‌మంతా ఒక్క‌టే’ అంటూ నినాదాలు చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇంచు మించు చాలా థియేట‌ర్ల‌లో ఇదే ప‌రిస్థితి. బాల‌య్య – ఎన్టీఆర్‌ల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌న్న విష‌యం ప‌రిశ్ర‌మ కోడై కూస్తోంది. నంద‌మూరి ఫ్యాన్స్ కూడా చెరో వైపుకు చేరిపోయారు. అప్ప‌ట్టుంచీ బాల‌య్య ఫ్యాన్స్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ డివైడ్ అయిపోయారు. అయితే.. జ‌న‌తా గ్యారేజ్ కోసం ఇద్ద‌రి ఫ్యాన్స్ కలిసిపోయినంత సంబ‌రం క‌నిపించింది. మ‌నమంతా ఒక్క‌టే అంటూ.. అర‌చుకోవ‌డం కూడా ఓ స‌రికొత్త వాతావ‌ర‌ణానికి నాంది ప‌లికిన‌ట్టైంది. సినిమా ఎలా ఉన్నా… థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ చేసిన హంగామా, జై బాల‌య్య నినాదాలూ… అంద‌రికీ గుర్తుండిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పదేళ్ల తర్వాత పండగొచ్చిందా…ఇదేనా ప్రజాస్వామ్యపంథా..!?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ - టీవీ9 రజినీకాంత్ ఇంటర్వ్యూ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ఇంటర్వ్యూకు బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం...

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close