ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త పోర్టులు కడతాం.. కడతాం అని టైం పాస్ చేస్తూంటారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ రారు.కానీ ఉన్న పోర్టులు మాత్రం చేతులు మారిపోతున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేసేసిన అదానీ గ్రూప్… తాజాగా గంగవరం పోర్టును కొంటోంది. దీంతో పాటు భావన పాడు పోర్టు కూడా అదానీకే ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

ఇప్పటికే ఏపీలోప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో… ఏపీలోని తీర ప్రాంత పోర్టులను అదానీ కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారుతోంది. అదానీది ప్రధానంగా పోర్టులు.. ఎయిర్‌పోర్టుల వ్యాపారం. పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. మరికొన్ని పోర్టులపైనా ఆయన గురి పెట్టారు. జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ద్వారా లీజ్ ఇచ్చే విధానంలో అదానీకి అప్పగించారు. భారత ప్రభుత్వం రైళ్లను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది. వీటిలోనూ అదానీ ముందు ఉంది.

ప్రభుత్వాల చేతుల్లో ఉండాల్సిందేనన్న గట్టి అభిప్రాయాలు వినిపించే పోర్టులు… ఎయిర్‌పోర్టులు.. రైళ్లు వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడుల్ని విపరీతంగా ఆహ్వానించడం.. అదీ కూడా.. ఆదానీ లాంటి బీజేపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామిక వేత్తలకు అగ్రతాంబూలం దక్కుతున్నాయి. వాటాలు అమ్మకపోతే… కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలు భయపడి అదానీకి ఆస్తులు అప్పగించేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. జీవీ కృష్ణారెడ్డికి చెందిన ఆస్తులపై సీబీఐ, ఈడీ దాడులు చేసింది. దానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు. అందులో వాటాలు అదానీకి అమ్మడానికి ఆయన నిరాకరించారు. దాడులు జరిగాయి. తర్వాత జీవీ కృష్ణారెడ్డి వాటాలను అదానీకి అప్పగించారు. దాంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. అన్ని చోట్లా ఇదే తరహా డీలింగ్స్ నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close