మాటల్లో చెబుతున్నట్లు పదవుల్లో “యాభై శాతం” ఎక్కడ..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇస్తానని.. సందర్భం వచ్చినప్పుడల్లా ఘనంగా ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నికలకు ముందు అదే చెప్పారు. ఎన్నికల తర్వాత అదే చెప్పారు. చివరికి అసెంబ్లీలోనూ అదే చెప్పారు. కానీ వరుసగా జరుగుతున్న నియామకాలను పరిశీలిస్తే.. అంతా ఒక వర్గానికి చెందిన వారి పేర్లే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన నెలన్నర రోజుల్లోనే అత్యంత కీలకమైన నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. వీటన్నింటినీ దాదాపుగా 90 శాతం ఒకే వర్గం వారు ఉన్నారు. ఆ వర్గం వారెవరో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటి వరకు పదవులు పొందిన వారి జాబితా..!

ప్రభుత్వ సలహాదారులు – కల్లం అజయ్‌రెడ్డి
సజ్జల రామకృష్ణారెడ్డి
ఐటీ సలహాదారులు = జె.విద్యాసాగర్‌రెడ్డి, దేవిరెడ్డి శ్రీనాథ్‌, కె.రాజశేఖర్‌రెడ్డి
ఏవియేష‌న్ అడ్వయిజ‌ర్‌ – వి. ఎన్ భ‌ర‌త్ రెడ్డి
కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా – జీవీడీ కృష్ణమోహన్
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి – విజయసాయిరెడ్డి
టీటీడీ చైర్మన్ – వై.వి.సుబ్బారెడ్డి
ఏపీఐఐసి చైర్మన్ – ఆర్కే రోజా రెడ్డి
తిరుప‌తి అర్బన్ డెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ చైర్మన్‌ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
సీఆర్డీఏ చైర్మన్ – ఆళ్ల రామకృష్ణారెడ్డి
వీఎమ్‌ఆర్డీఏ చైర్మన్ – ద్రోణంరాజు శ్రీనివాస్
వ్యవసాయ మిషన్‌ వైస‌ చైర్మన్ – ఎంవీఎస్ నాగిరెడ్డి
వ్యవసాయ మిషన్‌ సభ్యులు – పి.రాఘవరెడ్డి, చంద్రశే ఖర్‌రెడ్డి
వైద్యారోగ్య సంస్కరణలపై కమిటీ – భూమిరెడ్డి చంద్రశేఖ‌ర్‌రెడ్డి, బి సాంబ‌శివారెడ్డి, క‌సిరెడ్డి స‌తీష్‌కుమార్‌రెడ్డి
రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ – సీవీ కృష్ణారెడ్డి
ఎస్కేయూ రిజిస్ట్రార్ గా రిజిస్ట్రార్ – మల్లికార్జున్ రెడ్డి,
ఎస్వీ రిజిస్ట్రార్ గా రిజిస్ట్రార్ – శ్రీధర్ రెడ్డి

ఈ వేగం ఇతర సామాజికవర్గాలకు పదవులు ఇవ్వడంలో ఎందుకు లేదు..?

ఈ జాబితాలో ఇద్దరు, ముగ్గురు తప్ప అంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. ప్రభుత్వం ఏర్పడగానే ఆఘమేఘాలపై కొందరికి సలహాదారుల పదవులు కట్టబెట్టారు. రోజా లాంటి వారిని మంత్రి పదవులు రాలేదన్న కారణంగా అసంతృప్తికి గురి కాకుండా బుజ్జగించేందుకు పదవులు ఇచ్చారు. కానీ.. అదే పార్టీ కోసం.. పని చేసిన ఇతర వర్గాలను మాత్రం ఇంత వేగంగా గుర్తించాలనుకోలేదు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి టిక్కెట్ వదులుకున్నందుకు ఏకంగా మంత్రి పదవిని ఇస్తానని ప్రజల ముందు హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్ అనే నేతను.. ఇప్పుడు.. నామినేటెడ్ పోస్టుకు కాదు.. కదా.. అసలు పార్టీలో పట్టించుకునే నేత కూడా లేరు. ఇప్పటి వరకూ ప్రకటించిన పదవుల్లో సామాజిక న్యాయం ఎక్కడా పాటించలేదు. నోటి మాటగా చెబుతున్న.. యాభై శాతం కాదు కదా… అందులో.. పది సాతం కూడా.. ఇప్పటి వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించలేదు.

కీలకమైన నామినేటెడ్ పోస్టులన్నీ వారికేనా..?

చాలా మందికి పదవులు ఇవ్వబోతున్నారని.. వాటిలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్ద పీట వేస్తామని… ఈ పదవుల పంపకంలో లోపించిన సామాజిక సమీకరణాల వ్యవహారం.. కలకలం రేపుతూండేసరికి… వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే.. రెడ్డి సామాజికవర్గం నేతలకు ఇచ్చినంత వేగంగా.. తమకు ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని.. ఆ వర్గాలు.. నేరుగానే ప్రశ్నిస్తున్నాయి. అత్యంత కీలమకైన నామినేటెడ్ పోస్టుల్లో.. పూర్తిగా ఒక వర్గం వారినే నింపేశారు. గత ప్రభుత్వం బీసీలకే ఇచ్చిన టీటీడీ చైర్మన్ పోస్టు కూడా… జగన్ సర్కార్ రాగానే రెడ్డి నేతల చేతుల్లోకి వెళ్లిపోయింది.

నిధులు, విధుల్లేని పోస్టులో బీసీలకా..?

చైర్మన్ పోస్టులన్నీ రెడ్లకు ఇచ్చి.. డైరక్టర్ల పోస్టుల్లో మాత్రం… ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారిని నియమించబోతున్నట్లుగా… ఇతర ఓసీ కులాలకు పూర్తిగా.. మొండి చేయి చూపించబోతున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టమైపోతున్నాయి. డైరక్టర్లుగా పోస్టుల్లో ఉంటారు తప్ప.. వారికి పనేమీ ఉండదు. అంతా చైర్మన్ చేతిలోనే వ్యవహారాలు ఉంటాయి. కేవలం పదవులు పంచామని చెప్పుకునేందుకు అప్రాధాన్య పోస్టుల్లో.. ఇతర వర్గాల వారిని నియమించేందుకు కసరత్తు జరుగుతోందన్న అభిప్రాయం ఏపీ సర్కార్ తీరును చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. 130కిపైగా కుల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్.. బడ్జెట్‌లో వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాంతో.. ఆ కార్పొరేషన్లకు బీసీలను చైర్మన్లుగా నియమించినా… ఎలాంటి ప్రయోజనం ఉండదు. సామాజిక సమీకరణాల విషయంలో.. జగన్మోహన్ రెడ్డి.. తొలి రోజుల్లోనే లెక్క తప్పారనే అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close