ట్విట్టర్ కాదు లోకేష్..టీడీపీకి ” అంతకు మించి” కావాలి..!

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…. ట్విట్టర్‌లో దున్నేస్తున్నారు. ప్రభుత్వంపై సూటిగా సుత్తి లేకుండా… విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిలా.. కేవలం ఆరోపణలు చేసి .. ట్వీట్లు పెట్టకుండా… డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీడియోలు పెడుతున్నారు. సాక్ష్యాలతో సహా పెడుతూండటంతో.. మంచి స్పందన వస్తోంది. కానీ.. లోకేష్‌ నుంచి ఆశిస్తున్నది టీడీపీ క్యాడర్ అది కాదు.. అంతకు మించి.. ఆశిస్తోంది. ఆ “అంతకు మించి” ఏమిటో లోకేష్ అర్థం చేసుకోలేకపోతున్నారన్న భావన టీడీపీలో ఏర్పడిపోతోంది.

పార్టీ కోసం ట్వీట్లు మాత్రమేనా..?

నారా లోకేష్ సబ్జెక్ట్ ఉన్న నాయకుడు. ఇప్పుడు ప్రభుత్వాలు నగదు బదిలీ పథకాలతో హోరెత్తిస్తున్నాయి.. కానీ తెలుగు మొదట నగదు బదిలీ అనే ఆలోచన చేసిందే..నారా లోకేష్. రాజకీయాల్లోకి రాక ముందు.. చదువు పూర్తి చేసిన తర్వాత తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నప్పుడు.. 2009లో మొదటిసారిగా… టీడీపీ మేనిఫెస్టోలో నగదు బదిలీ పథకాన్ని పెట్టారు. అప్పట్లో చర్చనీయాంశమైనా… ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుంది.. ? ఇతర పథకాలను ఆపేస్తారా..? అన్న చర్చ ప్రజల్లోకి చేరడంతో.. పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడా నగదు బదిలీ పథకాలే ఎన్నికలను శాసిస్తున్నాయి. ఆ తర్వాత నారా లోకేష్ నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ.. ఆయనకు మాత్రం… సున్నితమైన ఇమేజ్ పడిపోయింది. దాన్ని వైసీపీ సోషల్ మీడియా టీం మరో రకంగా తీర్చిదిద్దింది. టీడీపీ ఓటమి తర్వాత కొంత మంది నేతలు.. లోకేష్‌పైనే ఆరోపణలు చేస్తున్నారు. ఫలితంగా.. లోకేష్.. తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ట్విట్టర్ వదిలి క్షేత్రానికి వెళ్తేనే కదలిక..!

ఇప్పుడు… ఇప్పుడు నాయకత్వ సామర్థ్యం చూపించాల్సింది లోకేషే..! పార్టీని పునరుజ్జీవింప చేయాల్సింది కూడా.. లోకేషే. అలా చేస్తేనే ఆయనకు రాజకీయభవిష్యత్ ఉంటుంది. ఈ విషయంలో లోకేష్ పాజిటివ్‌ ధోరణిలోనే ఉన్నారని.. ఆయన ప్రకటనలు చూస్తే తెలుస్తోంది. తాను ప్రజల్లోనే ఉంటానని.. గెలుపోటములకు ప్రాధాన్యత లేదని అంటున్నారు. కానీ.. ఆయన ప్రజల్లోకి రావడం కష్టమైపోతోంది. మంగళగిరిలో అడపాదడపా… కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ.. మొత్తంగా టీడీపీ ఆఫీస్‌కో.. లేకపోతే ట్విట్టర్‌కో పరిమితమైపోతున్నారు. లోకేష్ ట్విట్టర్‌లో ప్రభుత్వంపై చేసే విమర్శలు.. క్షేత్ర స్థాయిలో… పోరాటాలుగా మలిస్తే.. వచ్చే అప్లాజ్ వేరు. ప్రభుత్వం ఏర్పడి కొంత కాలమే అయింది కదా… మరికొంత సమయం ఇద్దామనుకోవడం… ఇప్పటి రాజకీయంలో వెనుకబడిపోవడానికే దారి తీస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల ఫలితాలనే తప్పు పట్టింది. అబద్దపు హామీలిచ్చి గెలిచారని చెప్పిన జగన్ మళ్లీ ఐదేళ్ల వరకూ.. అదే చెప్పారు. ప్రభుత్వం అసలేమీ చేయలేదని చెప్పి.. చెప్పి… ప్రజలు నిజమనుకునేలా చేశారు. లోకేష్‌కు ఇదంతా తెలియనిది కాదు.

పార్టీ మారే నేతలకు లోకేష్ చాన్సిస్తున్నారు మరి..!

లోకేష్.. ప్రభుత్వంపై పోరాటం మాత్రమే కాదు.. క్షేత్ర స్థాయిలో… తన కార్యాచరణ ఉంచుకోవాల్సిన అవసరం ఉందనేది టీడీపీ క్యాడర్ అభిప్రాయం. నిస్వార్థంగా పార్టీకి సేవలందించేవారిని కలుసుకునేందుకు … వారికి ప్రొత్సాహం ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రెండేళ్లలో పార్టీని బలోపేతం చేసుకుని.. మూడో ఏడు నుంచి… ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ.. ప్రజాపోరాటాలు చేయాలి. ఇలాంటి ప్రణాళికలు ముందస్తుగా వేసుకుని ఎంత సమర్థంగా అమలు చేస్తారో… అంతగా.. లోకేష్ నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది. లోకేష్‌ ట్విట్టర్ నుంచి బయటపడితేనే అది సాధ్యమవుతుంది. ఇప్పటికే పార్టీ మారాలనుకుంటున్న నేతలు.. లోకేష్‌ను కారణంగా చెప్పడం ప్రారంభించారు. అది వారి రాజకీయ వ్యూహం కావొచ్చు కానీ డ్యామేజ్ మాత్రం.. టీడీపీకే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close