ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి విధివిధానాలను సరళం చేశారు. ఒక్క రూపాయికే ఇంటి ప్లాన్లు అందించే ఏర్పాటు కూడా చేశారు. తాజాగా డెవలప్మెంట్ అగ్రిమెంట్లు మరియు సేల్ కం జీపీఏ (GPA) ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీని తగ్గించే కీలక నిర్ణయం తీసుకుంది.
డెవలప్మెంట్ అగ్రిమెంట్లపై స్టాంప్ డ్యూటీని 4 నుంచి 1 శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఆర్థిక భారాన్ని తగ్గించి, నిర్మాణ ప్రాజెక్టులను మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడుతుదంి. సేల్ కం జీపీఏ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఈ మార్పు ఆస్తులు కొనుగోలు చేసే వారికి ఖర్చునుతగ్గిస్తుంది. ఈ తగ్గింపులు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి.
ఈ నిర్ణయం ద్వారా ఆస్తుల లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. డెవలపర్లు , కొనుగోలుదారులకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుంది, ఇది రాష్ట్రంలో నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేస్తుంది. తాజా సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ (igrs.ap.gov.in)ని చూడవచ్చు.