టెస్టింగ్‌లో ఏపీ దూకుడు..! పది లక్షలు కంప్లీట్..!

కరోనా వైరస్ టెస్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రముఖంగా నిలబడుతోంది. ఇప్పటికే పది లక్షల మందికి టెస్టులు పూర్తి చేశారు. టెస్టింగ్. ట్రేసింగ్…ట్రీట్‌మెంట్ అనే విధానంలో ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు ప్రయత్నిస్తోంది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం రోజుకు పాతికవేలకుపైగానే టెస్టులు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఐదారు వేల టెస్టులు చేస్తేనే రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం.. 30వేల టెస్టులు చేసినా వెయ్యిలోపే కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా.. పాజిటివిటీ రేటు చాలా తక్కువ నమోదవుతోంది.

ఇతర రాష్ట్రాలతో సమానంగా.. కేసులు నమోదవుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. పాజిటివిటీ రేటు తక్కువగా ఉండంతో… వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నది.. అధికారవర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దేశంలో ప్రభావం చూపడం ప్రారంభమైన తర్వాత దేశంలో పెద్దగా టెస్టింగ్ సౌకర్యాలు లేవు. తర్వాత మెల్ల మెల్లగా పెంచుకుంటున్నారు. మెట్రో సిటీలు లేకపోయినప్పటికీ.. ఏపీ సర్కార్ వైరస్ నియంత్రణను సీరియస్‌గా తీసుకుంది. పెద్ద ఎత్తున టెస్టింగ్ సౌకర్యాలను పెంచుకుంది. పరీక్షల్లో అత్యంత ప్రామాణికమైన ఆర్టీ పీసీఆర్ టెస్టుల ల్యాబ్‌లను దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ ఏర్పాటు చేసుకుంది.

ఇక ట్రూన్ నాట్ ద్వారా మరింత సామర్థ్యాన్ని పెంచుకున్నారు. ఫలితంగా.. ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో భరోసా ఇస్తూ ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తోంది. క్వారంటైన్.. ఐసోలేషన్ కేంద్రాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి.. మెరుగైన సేవలు అందిస్తూండటంతో.. కరోనా విషయంలో ప్రజల వద్ద ప్రభుత్వానికి మంచి మార్కులు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close