లాక్‌డౌన్ ప్రచారంతో నిండిన సర్కార్ ఖజానా..!

హైదరాబాద్ లాక్‌డౌన్ ప్రచారంతో .. ప్రజల్లో ఏర్పడిన కంగారు.. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించి పెట్టింది. నిత్యావసర వస్తువులు.. నెలకు సరిపడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు జనాలు. అయితే.. దీనిపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెద్దగా ఉండదు. కానీ అసలు ఆదాయం.. మందు బాబుల వద్ద నుంచి వచ్చింది. గతంలో లాక్‌డౌన్ టైంలో బ్లాక్‌లో ఫుల్ బాటిల్ ఐదు వేల రూపాయలకు సైతం కొనుగోలు చేసిన అనుభవాలు గుర్తున్నాయేమో కానీ.. మళ్లీ లాక్‌డౌన్ ఆలోచనలు ప్రభుత్వం చేస్తోందన్న ప్రచారం జరగగగానే.. మందు బాబులు.. మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. ఎంత వీలైతే అంత కొని స్టాక్ పెట్టుకున్నారు. ఫలితంగా.. ప్రభుత్వానికి కాసుల పంట పండింది.

జూన్‌ 26 నుంచి 30 మధ్య ఐదు రోజుల్లో రూ.973.61 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్‌డౌన్‌ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు రూ.70-75 కోట్ల విలవైన మద్యాన్ని కొనుగోలు చేస్తూంటారు. జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు రోజుకు రూ.150 కోట్లకు పైగానే దుకాణాలకు వ్యాపారులు తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా అంటే జూలై 1 నుంచి 4 వరకు కూడా విక్రయాలు బాగానే ఉన్నాయి.

లాక్‌డౌన్ ఎత్తి వేసిన సమయంలో .. రెండు నెలల పాటు మద్యం దొరక్క అవస్థలు పడిన మందుబాబులు.. దుకాణాల ముందు పడిగాపులు పడ్డారు. అప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరోసారి లాక్ డౌన్ ప్రచారంతో .. ఆదే స్థాయి ఆదాయం వచ్చింది. కానీ లాక్ డౌన్ విషయంలో మాత్రం.. ప్రభుత్వం సైలెంటయిపోయింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని తేల్చేసింది. దీంతో.. మందుబాబులు ఊసురుమనక తప్పడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close