అనిల్ రావిపూడి ‘ప్లాన్ బి’ ఏంటి?

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ త‌ర‌వాత ‘ఎఫ్ 3’ స్క్రిప్టులో మునిగిపోయాడు అనిల్ రావిపూడి. ఎఫ్ 2లానే ఈ సినిమానీ సంక్రాంతి బ‌రిలో దింపుదామ‌ని భావించాడు. కానీ.. క‌రోనా వ‌ల్ల ప్ర‌ణాళిక‌ల‌న్నీ మారిపోయాయి. ఎఫ్ 3 స్క్రిప్ట‌యితే సిద్ధం చేసుకున్నాడు గానీ, ఆ సినిమాని మొద‌లెట్ట‌లేని ప‌రిస్థితి. వెంక‌టేష్ `నార‌ప్ప‌`తో బిజీ. అదెప్పుడు పూర్త‌వుతుందో తెలీదు. ఆ త‌ర‌వాత‌… రానా పెళ్లి ప‌నులున్నాయి. వెంకీ రెడీ అయినా.. వ‌రుణ్ తేజ్ – ఫ్రీ కావాలి. అది ఇంకాస్త క‌ష్టం. ఎందుకంటే.. బాక్స‌ర్ నేప‌థ్యంలో ఓసినిమా ఒప్పుకున్నాడు వ‌రుణ్‌. అది ఇటీవ‌లే మొద‌లైంది. ఆ సినిమా పూర్త‌యి వ‌రుణ్ ఎఫ్ 3కి కాల్షీట్లు ఇవ్వ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టి వ‌ర‌కూ… అనిల్ రావిపూడి ఆగేట్టు లేడు. ఎఫ్ 3కి ముందు మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నాడ‌ట‌.

ఎఫ్ 3 స్క్రిప్టు పూర్త‌వ‌గానే, మ‌రో క‌థ రెడీ చేశాడ‌ట రావిపూడి. ఇది ఓ యంగ్ హీరోకి స‌రిపోతుంద‌ని తెలుస్తోంది. స్టార్ ల బాద‌రాబందీ లేకుండా సింపుల్ గా పూర్త‌యిపోయే ఈ క‌థ‌ని ప‌ట్టాలెక్కించే ప్లాన్ లో రావిపూడి ఉన్నాడ‌ని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తీత ఫాస్ట్ గానే ఉంటుంది. భారీ తారాగ‌ణంతో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’లాంటి సినిమానే 80 రోజుల్లో పూర్తి చేసేశాడు. చిన్న సినిమా అయితే ఇంకా తొంద‌ర‌గా లాగించేస్తాడు. అనిల్ ద‌గ్గ‌ర లేడీ ఓరియెంటెడ్ కి సంబంధించిన మ‌రో క‌థ కూడా ఉంది. దానికీ రావిపూడి న‌గిషీలు దిద్దుతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒక‌టి ప‌ట్టాలెక్కించ‌డం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2018-19 పంచాయతీ అవార్డుల క్రెడిట్‌ను ఖాతాలో వేసుకున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన సంస్కరణలను మెచ్చి కేంద్ర ప్రభుత్వం 15 అవార్డులు ఇచ్చింది. " ఈ - పంచాయతీ పురస్కార్‌" కేటగిరిలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. సాధారణ కేటగిరిలో ప.గో...

“జై అమరావతి” అంటే బీజేపీలో సస్పెన్షనే..!

అమరావతి రైతుల కోసం పోరాడతామని భారతీయ జనతా పార్టీ ఓ వైపు చెబుతోంది. ఆ రైతులకు మద్దతు చెప్పేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ల వేటు వేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ఓ...

మోడీకి జగన్ అభినందనలు..!

నిజమే.. మీరు కరెక్ట్‌గానే చదివారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి జగన్ అభినందనలు తెలిపారు. మోడీ ఆ అభినందులు రిసీవ్ చేసుకుని .. జగన్ అభినందించినందుకు పొంగిపోయారో లేదో తెలియదు కానీ.. మోడీని జగన్ అభినందించిన...

క్రైమ్ : ఒకరిది ఆత్మహత్య…మరొకరిది హత్య..! ఇద్దరు తండ్రుల కథ..!

వారిద్దరూ ఆడపిల్లల తల్లిదండ్రులు. కని పెంచి.. అల్లారుముద్దుగా పెంచి.. తమకు చేతనయినంతలో మంచోళ్లు అనుకునే వాళ్లకే కట్టబెట్టారు. కానీ వారు అనుకున్నంత మంచోళ్లు కాదు. ఆ విషయం తెలిసి తమ కూతుళ్లు జీవితాలు...

HOT NEWS

[X] Close
[X] Close