కరోనాపై పోరులో ఏపీ శభాష్..!

వైరస్‌పై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ప్రతిభను కనబరుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరును అభినందించారు. చురుగ్గా పరీక్షలు నిర్వహించడంతో పాటు.. కేసుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆయన అన్నారు. ఆ అభినందనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హమైనదే. ఎందుకంటే… టెస్టుల సామర్థ్యాన్ని పెంచుకోవడంలో.. పొరుగు రాష్ట్రాలకు మించి మెరుగైన ప్రతిభను కనబర్చింది. ఇప్పుడు రోజుకు పదివేలకుపైగా టెస్టులు జరుగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే.

టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్..!

కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన మొదట్లో పట్టుమని పది టెస్టులు చేయలేని పరిస్థితి ఆంధ్రది. కానీ నెల రోజుల్లోనే పదివేల టెస్టులు చేయగలిగే సామర్థ్యం తెచ్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు 2,01,196 కరోనా పరీక్షలు చేశారు. ప్రతి పది లక్షల జనాభాకు 3700మందికిపైగా పరీక్షలు చేశారు. ఇంత సగటు మరే రాష్ట్రంలోనూ లేదు. ఏ రకంగా చూసినా జాతీయస్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ సగటు ఎంతో మెరుగ్గా ఉంది. కొత్త కేసుల కన్నా.. కోలుకుని ఇళ్లకు వెళ్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. రికవరీ రేటు దేశంలో 33 శాతంగా మాత్రమే ఉంది. ఏపీలో ఇది 53 శాతంగా ఉంది.

మర్కజ్, కోయంబేడు, వలస కూలీలు వస్తున్నా అదే పట్టుదల..!

పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ.. వైరస్‌ ఉన్న వారిని ఐసోలేషన్‌కి పంపుతూండటంతో.. కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది కానీ.. భవిష్యత్‌లో వచ్చే ముప్పు మాత్రం.. తగ్గిపోతుందని భావించవచ్చు. ఒకరి నుంచి ఒకరికి అయ్యే వ్యాప్తి తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్‌లో కేసులు నమోదు కావు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఓ సారి మర్కజ్.. మరోసారి కోయంబేడు మార్కెట్.. చిక్కులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం వలస కూలీలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అలాగే.. ఇతర దేశాల నుంచి కూడా.. ప్రవాసాలు వస్తున్నారు. ఇలాంటి వారి ద్వారా మళ్లీ కరోనా కేసులు పెరుగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ.. అందరికీ పక్కాగా చికిత్స అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కేరళ స్థాయిలో రికవరీ రేటు..!

ఏ రాష్ట్రంలోనూ కరోనా బాధితులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఏపీ సర్కార్.. డిశ్చార్జ్ అవుతున్న వారికి.. క్వారంటైన్ కేంద్రం నుంచి వెళ్తున్న వారికి రూ. రెండు వేలు అందిస్తోంది. రోగ నిరోధకశక్తి పెంచే.. ఆహారాన్ని అందిస్తోంది. అందుకే.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి.. త్వరలో కేరళ తరహాలో ఏపీలోనూ.. కరోనా కట్టడి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close