ఆదాయం తగ్గుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి తనకు తెలిసిన లెక్కలేవో .. ఆర్థిక సలహాదారులు ఇచ్చేగ్రాఫ్లోవో ట్విట్టర్ పెట్టి చాట భారతాలు రాస్తున్నారు ఈ మధ్య. కానీ వాస్తవం మాత్రం వేరుగా ఉంది. ఏపీ జీఎస్టీ ఆదాయం పెద్ద రాష్ట్రాల్లో అత్యధికంగా పెరుగుతోంది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21 జీఎస్టీ పెరిగిందని తాజాగా కేంద్ర ప్రభు్తవ లెక్కలు వెల్లడించాయి. దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల అధిక ఆదాయం వచ్చింది. తెలంగాణలోనూ జీఎస్టీ పెరిగింది. అక్కడ పన్నెండు శాతం పెరిగింది.
ఏపీ ఆదాయ వనరులన్నీ మెరుగుపడ్డాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మద్యం ధరలు తగ్గించినప్పటికీ నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడం, నకిలీ మద్యాన్ని అరికట్టడం, స్కాం లేకుండా చూడటంతో మద్యం ఆదాయం కూడా పెరిగింది. ఇలా అన్ని రంగాల్లోనూ ఏపీ పురోగతి సాధిస్తోంది. ఆదాయాలు పెరుగుతున్నాయి. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తూండటంతో.. సహజంగానే సంపద సృష్టి జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతూండటంతో సంక్షేమ పథకాల అమలుకు నిధుల ఒత్తిడి ఉండటం లేదు. వీలైనంత సాఫీగా పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తున్నారు. ఇంత ప్రశాంతంగా నిధుల సమస్య లేకుండా ప్రభుత్వం నడుస్తూండటం వైసీపీ నేతల్ని కంగారు పెడుతోంది. అందుకే ఆర్థిక వనరులు దెబ్బకొట్టడానికి ఈమెయిల్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ అలాంటి మెయిల్స్ ఏపీ పరుగును ఆపలేవని స్పష్టమవుతోంది.