కొత్తపలుకు : జగన్‌పై మోడీకి కోపం వచ్చేసింది..!

ఈ వారం.. రాసిన కొత్త పలుకులో..ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుపై… విమర్శలు చేసి.. మంచిది కాదని.. హితవులు చెప్పారు. అయితే.. ఇందులో ఓ సంచలన విషయాన్ని కూడా వెల్లడించారు. అదే ప్రధాని మోడీ.. జగన్ తీరుపై అసహనంతో ఉండటం. అయితే.. దానికి గత ప్రభుత్వ నిర్ణయాలను వెలికి తీయడమో… మరో పాలనా పరమైన అంశమో కాదు. పూర్తిగా బీజేపీ తరహా సిద్ధాంతపరమైనది.

హోదా మంటలు రేపే ప్రయత్నం చేయడం మొదటి కారణం..!

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని భారతీయ జనతాపార్టీ కూడా తప్పుబడుతోంది. ఇప్పటివరకు జగన్మోహన్‌రెడ్డికి స్నేహహస్తం చాచిన భా.జ.పా తన వైఖరి మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయని దీంతోనే..  వేమూరి రాధాకృష్ణ విశ్లేషించారు. నీతిఆయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదాను ప్రస్తావించడంతోపాటు, రాష్ట్రానికి హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదింపజేసుకున్న జగన్మోహన్‌రెడ్డి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసిందని రాధాకృష్ణ “కొత్తపలుకు”. ముఖ్యమంత్రి హోదాలో నన్ను కలిసినప్పుడు ప్రత్యేక హోదా విషయం మరిచిపొమ్మని చెబితే సరేనని అంగీకరించిన జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత ఇలా చేయడం ఏమిటి? అని నరేంద్రమోదీ భా.జ.పా నాయకుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసిందన్నారు.

క్రిస్టియన్ కోటరీని ఏర్పాటు చేసుకోవడం రెండో కారణం..!

రాష్ట్రంలో క్రైస్తవమతాన్ని వ్యాప్తిచేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని.. ప్రధానమంత్రి బలంగా నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయంలోనే కాకుండా తన చుట్టూ కూడా క్రిస్టియన్ కోటరీని జగన్ ఏర్పరచుకుంటున్నారని ప్రధాని మోదీ కొంత మంది వద్ద వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయని రాధాకృష్ణ చెబుతున్నారు.  దీన్నిబట్టి రానున్న రోజులలో బీజేపీ నాయకులు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై దాడిని కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. “కొత్తపలుకు”లో ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ… తెలంగాణ నుంచి ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్‌గా.. నియమించుకోవాలనుకున్న స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం అడ్డుపుల్ల వేసింది. ఆయన కూడా.. క్రీస్టియనే. ఇది .. వేమూరి రాధాకృష్ణ చెబుతున్న “కొత్తపలుకు”కి సాక్ష్యంలా ఉంది.

బీజేపీని మళ్లీ విలన్‌గా చేసే ప్రయత్నం చేయడం మూడో కారణం..!

బీజేపీ వేస్తున్న ఎత్తుగడకు విరుగుడుగానే..  జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాను మళ్లీ తెరమీదకు తెస్తున్నారని.. “కొత్తపలుకు”లో రాధాకృష్ణ చెబుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం తనకు ముప్పుగా పరిణమించే బీజేపీ నాయకులకు జగన్ ఎంత మాత్రం మేలు చేయడని.. రాధాకృష్ణ చెబుతున్నారు. చంద్రబాబు చేసినట్లే.. ఏపీకి నిధులు, విభజన  హామీల విషయంలో… బీజేపీని విలన్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రధాని నమ్ముతున్నారని.. అందుకే ఆగ్రహంగా ఉన్నారని.. వేమూరి రాధాకృష్ణ చెబుతున్నారు.
“కొత్తపలుకు” మొత్తంలో.. నెల రోజుల పాలనా తీరును సైటైరిక్‌గా విమర్శలు గుప్పించారు రాధాకృష్ణ. ఆయన తీరుతో.. వైసీపీకే కాదు.. రాష్ట్రానికి కూడా నష్టమని తేల్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆదర్శప్రాయ వ్యక్తిగా తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్న తమ్మినేని..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. తనను తాను ఆదర్శప్రాయ వ్యక్తిగా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఆదర్శ ప్రాయ వ్యక్తిగా.. స్పీకర్ హోదాలోనే కోర్టులపై కామెంట్లు చేశానని చెప్పుకొచ్చారు. న్యాయవ్యవస్థపై.. తమ్మినేని సీతారాం రెండురోజుల...

ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి...

బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌... ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు...

అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా... దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close