ఆంధ్రజ్యోతి అతి: పాక్ ప్రధాని ని బాలయ్య ఫ్యాన్స్ భయపెడుతున్నారట

తెలుగు పత్రికల జర్నలిజం విలువలు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు నడిపే సాక్షి పత్రిక, తెలుగుదేశం పార్టీ కరపత్రంలా మారిన ఆంధ్రజ్యోతి పత్రిక సొంత రాజకీయ పార్టీలకు భజన చేసే విషయంలో పోటీ పడుతున్నాయి. అలా పోటీపడే క్రమంలో కొన్నిసార్లు తన పైత్యాన్ని ప్రదర్శించే కథనాల ని వెలువరుస్తున్నాయి.

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పై తమ అభిప్రాయాలను వెలువరుస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల, అన్ని ప్రాంతాల ప్రజలు పాకిస్తాన్ చర్యను తూర్పారబడుతున్నారు. అయితే ఈ నిరసనల వార్తను ప్రచురించే క్రమంలో కూడా ఆంధ్రజ్యోతి తన సహజ పైత్యాన్ని ప్రదర్శించింది. బాలకృష్ణ అభిమానులు పాకిస్తాన్ ప్రధాని ని భయపెడుతున్నారు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ‘మీ దేశాన్ని ముగించడానికి బాలయ్య బాబు చాలు.. బాంబులతో కాదు రా కంటి చూపుతో చంపేస్తాడు’ అంటూ బాలకృష్ణ అభిమానులు ఇమ్రాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ లో కామెంట్లు పెడుతున్నారని వార్త రాస్తూ బాలకృష్ణ అభిమానులు ఏకంగా పాకిస్తాన్ ప్రధాని ని భయపెడుతున్నారు అని వ్రాసుకొచ్చింది. కనీసం ఆర్మీ కి సంబంధించిన వార్తలను ప్రజెంట్ చేసేటప్పుడు అయినా తమ సొంత పార్టీ కి, తమ పార్టీ నాయకులకు భజన చేసే ప్రోగ్రామ్స్ ని పక్కన పెట్టి నిజాయితీగా రాస్తే బాగుంటుందని పాఠకుల అభిప్రాయం.

అదే సమయంలో, ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతున్న సమయంలో, సైనికులు ప్రాణాలు అర్పిస్తున్న సమయంలో, బాలకృష్ణ డైలాగులను, సినిమా డైలాగ్ లను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వారిని కూడా నెటిజన్లు మందలిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాల విడుదల సందర్భంగా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఒకరినొకరు ట్రోలింగ్ చేసుకోవడం మామూలే. కొన్నిసార్లు అవతలి హీరోల డైలాగులు అసందర్భంగా వాడి ఆయా హీరోలకు డామేజ్ చేసేలా యాంటీ ఫ్యాన్స్ చేయడం కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా జరిగేదే. అయితే, కనీసం దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో నైనా ఇలాంటి ట్రోలింగ్స్ చేయకపోవడం మంచిది అని మిగతా నెటిజన్లు వీరిని మందలిస్తున్నారు.

అయితే, సోషల్ మీడియాలో జరిగే ఈ రచ్చ ని అర్థం చేసుకోవడం రాక ఆంధ్రజ్యోతి, బాలయ్య అభిమానులు ఏకంగా పాకిస్తాన్ ప్రధానిని భయపెడుతున్నారు అంటూ కథనాన్ని రాసుకొచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన వార్తలను ప్రజెంట్ చేసేటప్పుడు కూడా, తమ పైత్యాన్ని ప్రదర్శించడం ఆంధ్రజ్యోతి’ ని విమర్శల పాలు చేస్తోంది.

– జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close