టీటీడీ చైర్మన్, టీవీ5 యజమాని బీఆర్ నాయుడును నేరుగా టార్గెట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి. అలిపిరిలో భక్తులకు వసతి కోసం టౌన్ షిప్ నిర్మించాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. అది ఒక్క బీఆర్ నాయుడునే చేశారని ఆంధ్రజ్యోతి టాం టాం చేసింది. నిర్మించాలనుకున్న చోట్ల శిల్పశాల ఉందని దాన్ని తొలగించి అక్కడ టౌన్ షిప్ నిర్మించాలనుకుంటున్నారని దీనంతటికి కారణం బీఆర్ నాయుడేనని తేల్చి నిందించింది. ఈ కథనంలో ఇలా చేయడం వల్ల ఆయనకు ఏంటి లాభం అనేది మాత్రం చెప్పలేదు. ఏదో తప్పు చేస్తున్నారు అన్న అర్థం వచ్చేలా కథనం రాశారు.
దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది. అది బోర్డు నిర్ణయం అని.. అలిపిరి నుంచి కాకుండా ఎక్కడో ఆంధ్రజ్యోతి సూచించినట్లుగా పేరూరులో నిర్మిస్తే భక్తులు అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపించరన్న కారణంగా అలిపిరిలోనే నిర్మించాలని నిర్ణయించారు. శిల్పశాలను తీసేస్తారా.. వేరే చోట పెడతారా అన్నది టీటీడీ నుంచి క్లారిటీ తీసుకుని ఆంధ్రజ్యోతి ప్రచురించాల్సి ఉంది. కానీ అలాంటి పని చేయలేదు. శిల్పశాలను టీటీడీ తీసేసే అవకాశం ఉండదు. ఇదొక్కటే కాదు.. గతంలోనూ బీఆర్ నాయుడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా నిందిస్తూ వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నారు.
ఇరవై ఏళ్ల క్రితమే కాటేజ్ కోసం జంగా కృష్ణమూర్తి స్థలం కేటాయింపు జరిగినా.. వివిధ సమస్యలో ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని బోర్డులో కేటాయించిన నిర్ణయాన్ని బీఆర్ నాయుడుకే అంటగట్టి ఆంధ్రజ్యోతి నిందించింది. టీటీడీ చైర్మన్ అయ్యాక.. తనపై.. టీటీడీపై తప్పుడు ప్రచారాలు, అతి ప్రచారాలు చేయకుండా ఉండేందుకు బీఆర్ నాయుడు పాత గొడవలన్నీ మర్చిపోయి అందరి దగ్గరకు వెళ్లి పరిచయాలు పెంచుకున్నారు. కానీ రాను రాను అవన్నీ మళ్లీ తగ్గిపోయి.. ఈగోలు తెరపైకి వస్తున్నట్లుగా ఉన్నాయి. ఆయన ఆర్కేకు టార్గెట్ అయ్యారని తాజా వార్తలు నిరూపిస్తున్నాయని అనుకోవచ్చు.
