చిరు ఓకే అంటే మూడు నెల‌ల్లో స్క్రిప్టు: అనిల్ రావిపూడి

చేసింది నాలుగు సినిమాలు. అయితేనేం.. స్టార్ లీగ్‌లోకి చేరిపోయాడు. `స‌రిలేరు నీకెవ్వ‌రు` కూడా హిట్ట‌యిపోతే అనిల్ రావిపూడి క్రేజ్ ఇంత‌కు ప‌దింత‌లు పెరిగిపోతుంది. చిరంజీవి కూడా అనిల్ రావిపూడి స్టైల్ చూసి ముగ్దుడైపోయాడు. అందుకే చిరు అవ‌కాశం ఇస్తే.. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి తాను సిద్ధ‌మే అని ముందే ప‌చ్చ జెండా ఊపేస్తున్నాడీ కుర్ర డైరెక్ట‌ర్‌.

”చిరంజీవిగారంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న నా ఫంక్ష‌న్‌కి రావ‌డ‌మే గొప్ప విష‌యం. చిరు అవ‌కాశం ఇస్తే.. కేవ‌లం మూడు నెలల్లో స్క్రిప్టు సిద్ధం చేసి ఆయ‌న ముందుంచుతా” అంటున్నాడు అనిల్‌. `స‌రిలేరు నీకెవ్వ‌రు` హిట్ట‌యితే చిరు నుంచి త‌ప్ప‌కుండా పిలుపు రావొచ్చు. త‌న కోస‌మో, చ‌ర‌ణ్ కోస‌మో.. ఆయ‌న ఓ క‌థ సిద్ధం చేయ‌మ‌ని అడిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి అది జ‌ర‌గాలంటే ఈనెల 11న బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందే.

అన్న‌ట్టు ఎఫ్ 2ని హిందీలో రీమేక్ చేయ‌మ‌ని త‌న‌నే అడుగుతున్నార్ట‌. అయితే ఈ విష‌యంలో తానేం ఆలోచించ‌లేదని, ఎఫ్ 3 స్క్రిప్టు కూడా సిద్ధం అవుతోంద‌ని, అయితే తన కొత్త‌సినిమా ఎప్పుడు, ఎవ‌రితో అనేది ఇప్పుడే చెప్ప‌లేన‌ని అంటున్నాడు అనిల్ రావిపూడి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close