యానిమల్ కి సీక్వెల్ కూడా…

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’. ఈ చిత్రం డిసెంబర్‌1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం నిడివి కాస్త ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం నిడివి 3.30గంటలని తెలుస్తోంది. నిజానికి ఇంత నిడివి వున్న సినిమాని రెండు పార్టులు గా చేస్తారు. అయితే సందీప్ ఒకే పార్ట్ గా విడుదల చేయాలని పట్టుదలతో వున్నారు. అలాగే నిడివి విషయంలో చాలా నమ్మకంగా వున్నారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబధించిన మరో ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. యానిమల్ కి సీక్వెల్ వుంటుందని సమాచారం. యానిమల్ చివర్లో సీక్వెల్ కి సంబధించిన లీడ్ ని ఇస్తారు. యానిమల్ లో కథ పరంగా ఒక ముగింపు ఇచ్చినప్పటికీ ఇందులో చాలా పాత్రల ఆర్క్ కొనసాగింపు కోరుకుంటాయని, దానికి సంబధించిన బ్యాక్ స్టోరీలు సీక్వెల్ లో ఆసక్తికరంగా చూపిస్తారని వినిపిస్తోంది. ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్లాన్ వుందని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close