ఛాన్స్ మిస్.. త్రివిక్రమ్ అ..ఆ నుండి అనిరుథ్ తొలగింపు

మాటల మాంత్రికుడు త్రివిక్రం లెక్క కాస్త తప్పిందని చెప్పాలి. తన తీసే సినిమాలో ప్రతిది పర్ఫెక్ట్ గా ఉండాలని ముందునుండి జాగ్రత్తపడే దర్శకుడు త్రివిక్రం ప్రస్తుతం చేస్తున్న అ..ఆ సినిమా కోసం ఎప్పుడు లేని వింత అనుభవాలను ఫేస్ చేస్తున్నాడట. సినిమా మొదలైన నాటినుండి అ..ఆ సినిమా మీద ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. ముఖ్యంగా సినిమా లీడ్ రోల్స్ చేస్తున్న నితిన్, సమంతల మధ్య కొన్ని రోజులు మాటలు లేవంటూ మీడియా హడావిడి చేసింది.

ఇక ఇప్పుడేమో ఆ సినిమా సంగీత దర్శకుడిని కూడా మార్చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తన సినిమాలకు దేవిని ప్రిఫర్ చేసే త్రివిక్రం ఈసారి కొత్తగా కోలీవుడ్ సంగీత కెరటం అనిరుథ్ ని తీసుకోదలిచాడు. అయితే అనిరుథ్ ప్రస్తుతం ఆ సినిమా చేసే అవకాశం లేదని తెలియడంతో ఇప్పుడు తనని అ..ఆ సినిమా నుండి తప్పించి వేరే సంగీత దర్శకుడిని పెట్టే ప్రయత్నంలో ఉన్నారట.

సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సందర్భంలో సినిమా సంగీత దర్శకుడి పాత్ర కీలకం కాబట్టి త్రివిక్రం దేవి శ్రీ ప్రసాద్, మిక్కీ జె మేయర్ లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు అ..ఆ సినిమాకు సంగీతం అందిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూర్య తండ్రిపై కేసు పెట్టిన టీటీడీ..!

తమిళ స్టార్ సూర్య తండ్రి శివకుమార్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం కేసు పెట్టింది. తమిళనాడులో జరిగిన ఓ సభలో శివకుమార్‌ తిరుమల ఆలయానికి వెళ్లవద్దని పిలుపునిచ్చిట్లుగా టీటీడీకి ఫిర్యాదు అందింది. తిరుమలలో డబ్బులున్న...

కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులతో రేవంత్ దూకుడు..!

మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేస్తే.. జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎన్జీటీ వేసిన కమిటీ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. జన్వాడలో ఉన్న కేటీఆర్...

ఏపీ సచివాలయంలో పది మందికి వైరస్..!

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం పేషీలో పని చేసే ఓ అధికారి డ్రైవర్‌కు కూడా కరోనా నిర్ధారణ అయింది. మొత్తంగా ఇప్పటి వరకూ పది మంది సచివాలయ ఉద్యోగులకు...

ఫీజు కోసం మోహన్‌బాబు ఇప్పుడు కోర్టుకెళ్లరా..?: టీడీపీ

ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పేరు మార్చి.. నిబంధనలు మార్చి.. ప్రజాధనాన్ని ప్రైవేటు కాలేజీలకు దోచి పెడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అర్హత లేని కాలేజీల్లోనూ ఇష్టానుసారం ఫీజులు...

HOT NEWS

[X] Close
[X] Close