తెలంగాణలో మరో పది మందికి నెగెటివ్..!

కరోనా విషయంలో తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటికే పధ్నాలుగు మంది కరోనా పాజిటివ్ పేషంట్లను.. నెగెటివ్‌గా మార్చి.. డిశ్చార్జ్ చేసిన వైద్యులు.. మరో పది మంది విషయంలోనూ విజయం సాధించారు. ప్రస్తుతం.. 77 మంది కరోనా పాజిటివ్ బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పది మందికి నెగెటివ్ వచ్చింది. ఫార్మారిటీస్ పూర్తి చేసి.. వారిని కూడా డిశ్చార్జ్ చేస్తారు. మొత్తంగా తెలంగాణలో నేటి వరకూ 97 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అందులో మొదటి కరోనా పాజిటివ్ వ్యక్తి.. కొద్ది రోజులకే డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఇండొనేషియా నుంచి మత ప్రచారానికి వచ్చిన వారందరికీ కరోనా పాజిటివ్ గా తేలడంతో… కౌంట్ ఒక్క సారిగా పెరిగింది.

ఆ తర్వాత ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ఈ సంఖ్య మరింతగా పెరిగింది. ప్రస్తుతం అలా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారందర్నీ ప్రభుత్వం ట్రేస్ చేస్తోంది. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయో లేదో.. పరీక్షలు చేస్తున్నారు. కొంత మంది ఇలా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ఆచూకీ ప్రభుత్వ వర్గాలు తెలుసుకోలేకపోతున్నాయి. వీరందర్నీ.. స్వచ్చందంగా ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని ట్రేసింగ్ చేయాలని .. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దని సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇప్పటికి వరకూ ఆరుగురు చనిపోయారు. వీరంతా.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. పైగా.. చనిపోయిన తర్వాతే వీరికి కరోనా ఉన్నట్లుగా తేలింది. కరోనా పాజిటివ్ గా తేల్చి.. ఆస్పత్రిలో ఐసోలేషన్ చేయించిన తర్వాత ఎవరూ మృతి చెందలేదు. మరింత పకడ్బందీగా.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని ట్రేస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close