RGV అంటే… రోజూ గిల్లే వాడు!

రాంగోపాల్ వ‌ర్మ కెలుకుడికి చిర్రెత్తుకొచ్చిన‌వాళ్ల‌లో జొన్న‌విత్తుల ఒక‌రు. ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా, నేనా? అంటూ వాద‌న‌లు జ‌రిగాయి. టీవీ డిబేట్ల‌లో ఇద్ద‌రూ కూర్చుంటే మాంచి మ‌సాలా సినిమా చూసిన థ్రిల్ క‌లిగేది ప్రేక్ష‌కుల‌కు. ఆర్జీవీపై జొన్న‌విత్తుల ఎంత ఇరిటేట్ అయిపోయారంటే.. వ‌ర్మ‌పై ఓ సినిమా తీసి, వ‌ర్మ వ‌ల్ల స‌మాజం ఏమైపోతుందో చూపించేయాలి అనిపించేంత. ఇప్పుడు అదే చేస్తున్నారు. ‘ఆర్‌జీవీ’ పేరుతో ఓ సినిమా ఇది వ‌ర‌కే మొద‌లెట్టారు. క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల షూటింగు ముందుకు క‌ద‌ల్లేదు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లెడ‌తాన‌ని చెబుతున్న జొన్న విత్తుల ‘ఆర్‌జీవీ’ టైటిల్ లోగోని ఆవిష్క‌రించారు. అంతేకాదు. ఆర్‌జీవీ అనే ప‌దానికి కొత్త అర్థం చెప్పారు. ‘రోజూ గిల్లే వాడు’ అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. అవును మ‌రి.. ట్విట్ట‌ర్ ఖాతాలో చేరి, రోజూ ఏదో ఓ ట్వీట్ పెట్టి, ఎవ‌రినో ఒక‌రిని గిల్ల‌క‌పోతే.. ఆర్జీవీకి నిద్ర‌ప‌ట్ట‌దు. వ‌ర్మ ఈమ‌ధ్య కాలంలో త‌న సినిమాల కంంటే ట్వీట్ల ద్వారానే ఎక్కువ మందికి వినోదం పంచుతున్నాడు. వ‌ర్మ‌కి త‌గిన ట్యాగ్ లైనే పెట్టాడు జొన్న‌విత్తుల‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close