ఫ్లాష్ బ్యాక్‌: క‌ల్లు మామ‌.. పాట పుట్టిందిలా!

వ‌ర్మ నుంచి వ‌చ్చిన ఆఖ‌రి క్లాసిక్‌… స‌త్య‌. ఆ త‌ర‌వాత వ‌ర్మ సూప‌ర్ హిట్ అనే ప‌దానికి దాదాపుగా దూర‌మైపోయాడు. స‌త్య‌లో క్యారెక్ట‌రైజేష‌న్స్ అద్భుతంగా ఉంటాయి. పాట‌లేవీ పెద్ద‌గా గుర్తుండ‌వు గానీ, ‘క‌ల్లు మామ‌’ పాట మాత్రం ఆరోజుల్లో అద‌ర‌గొట్టింది. అదో మాస్ గీతం. మంచి బీటుతో సాగుతుంది. ఇప్ప‌టికీ మ‌త్తెక్కించే గీతాలు ఒక్క‌సారి ప్లే చేసుకోవాలంటే స‌త్య‌లోని క‌ల్లుమామ గీతాన్ని రివైండ్ చేసుకోవాల్సిందే. ఈ పాట రాసిందెవ‌రో తెలుసా? కోన వెంక‌ట్‌. ఈ పాట వెనుక ఓ గ‌మ్మ‌త్తైన స్టోరీ ఉంది.

‘స‌త్య‌’లోని క‌థ‌లో సంద‌ర్భానుసారం ఓ రౌడీ గ్యాంగు పాడుకునే పాట ఒక‌టి రావాలి. ఈ పాటని రాయ‌మ‌ని సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిని సంప్ర‌దించాడు వ‌ర్మ‌. ఆయ‌న రెండు మూడు వెర్ష‌న్లు రాసి ఇచ్చారు కూడా. కానీ.. అవేవీ వ‌ర్మ ఊహ‌ల‌కు త‌గిన‌ట్టుగా లేవు. పాట‌లో రా నెస్ కావాలి. క్రిమిన‌ల్స్ ఓ పాట పాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి ఆ పాట‌. సీతారామ‌శాస్త్రి త‌న స్థాయికి ప‌ది మెట్లు దిగి క‌లం ప‌ట్టుకున్నా – వ‌ర్మ కి న‌చ్చేలా పాట రాలేదు. స‌త్య సినిమాకి ప‌నిచేస్తున్న కోన‌.. తాను స‌ర‌దాగా రాసుకున్న పాట‌ని వ‌ర్మ‌కి వినిపించాడు. అది వ‌ర్మ‌కి న‌చ్చేసింది. దాన్నే రికార్డు చేసేశారు. ఈ విష‌యం సీతారామ‌శాస్త్రికి తెలీదు. ఈ పాట వినిపించ‌డానికి శాస్త్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు కోన‌. `పాట రికార్డు చేశారు. కానీ మీరు రాసిన పాట కాదు. నేను రాసిన పాట‌` అంటూ భ‌యంభ‌యంగానే వినిపించాడు. అది సీతారామ‌శాస్త్రికి బాగా న‌చ్చింది. వెంట‌నే వ‌ర్మ‌కి ఫోన్ చేసి ‘నేనుమ‌రో ప‌ది వెర్ష‌న్లు రాసినా, ఇంత కంటే బాగా రాదు’ అని చెప్పాడ‌ట‌. అలా… కోన వెంక‌ట్ పాట రాజ‌ముద్ర‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికీ ఆ పాట‌ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తాయా?

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర‌వాత‌..? - ప్ర‌స్తుతం ప్ర‌పంచం న‌డ‌వ‌డిక‌, మ‌నుషులు ఆలోచించే విధానం, బ‌తుకులు రెండు ర‌కాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటికంటే...

HOT NEWS

[X] Close
[X] Close