ఈ గాలి ఎంత హాయి …ఈ గాలి ఎంత స్వచ్ఛం

నెగేటిప్ పక్కనే పాజిటివ్ ఉంటుంది. చేదు పక్కనే మంచి ఉంటుంది. కష్టం పక్కనే సుఖం ఉంటుందని పెద్దలు అంటారు కదా. కరోనా వైరస్ వ్యాప్తి చెందాక ప్రపంచంలోని 95 దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అదొక్కటే మార్గం కాబట్టి. కరోనా వైరస్ మహా ప్రమాదకారి. ప్రపంచాన్ని మట్టుపెడుతోంది. వెయ్యికాళ్ల జెర్రిలా పాకిపోతోంది. కాబట్టి ప్రపంచం సమస్తం బందైపోయింది. మనుషులు ఇళ్లల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో బందీలైపోయారు. బితుకు బితుకుమంటూ ఇళ్లల్లో పడివుంటున్నారు. అన్ని రకాల వాహనాలు, పరిశ్రమలు, కర్మాగారాలు మూతబడిపోవడంతో మానవాళికి ఓ మేలు జరిగింది. ఏమిటది? వాతావరణ కాలుష్యం లేకుండాపోయింది. గాలిలో స్వచ్ఛత ఏర్పడింది. ఈ గాలి ఎంత హాయిగా ఉంది అనుకునే పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట నిజమే అయినా వాతావరణం మెరుగుపడిందనేది సంతోషకరమైన వార్త. కరోనా అనేది ఊహకు కూడా అందకముందు వాతావరణ కాలుష్యంపై ప్రతి రోజూ ఆందోళనే. వాతావరణ కాలుష్య నివారణ ఎలా చేయాలనే దానిపై ప్రపంచదేశాలు అనేకసార్లు సమావేశాలు కావడం మనం చూసాం. ఐక్యరాజ్య సమితి అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రావడానికి కొద్దీ రోజుల ముందు కూడా ఇండియాలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితా తయారుచేస్తే వాటిల్లో హైదరాబాదు కూడా ఉంది. ఇక ఢిల్లీ సంగతి చెప్పక్కరలేదు. అక్కడ సరి సంఖ్య-బేసి సంఖ్య విధానం పాటించినా కాలుష్యం తగ్గలేదు. దేశంలో అత్యధిక కాలుష్యకారక నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు ఎప్పుడూ ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అక్షింతలు వేస్తూనే ఉండేవి. తెలంగాణా ప్రభుత్వం భారీఎత్తున హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడానికి ప్రధాన కారణం కాలుష్య నివారణే. వాతావరణ కాలుష్యంపై కొన్నేళ్లుగా ప్రపంచదేశాలు ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఇదిలా కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి వచ్చిపడింది. చివరకు లాక్ డౌన్ కారణంగా స్వచ్ఛమైన గాలి అందుబాటులోకి వచ్చింది. కానీ దీన్ని ఆస్వాదించే యోగం మనకు లేదు. ఇంట్లో బందీలం అయ్యాం కదా. కాలుష్యపు పొగమంచుకు ఢిల్లీ పెట్టింది పేరు. కానీ కొన్ని రోజులుగా ఆ బాధ లేదు. దేశంలోని 103 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు చేస్తే 88 నగరాల్లో వాయు కాలుష్యం లేదని తేలింది. లాక్ డౌన్ ప్రారంభంలోనే ఎయిర్ క్వాలిటీ పెరిగిందని వార్తలు వచ్చాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నకొద్దీ నాణ్యత మరింత మెరుగుపడుతూ వస్తోంది. ప్రస్తుతం దేశంలోని 23 నగరాల్లో అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తోందని పరీక్షలు తెలియచేస్తున్నాయి. గాలిని కలుషితం చేసే నైట్రోజన్ ఆక్సయిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని సమాచారం. అయితే ఇలా లాక్ డౌన్ కారణంగా గాలి స్వచ్చంగా ఉండటం తాత్కాలికమే. కరోనా మహమ్మారి అంతమైతే లాక్ డౌన్ ఎత్తేస్తారు కదా. మళ్ళీ పరిస్థితి యథాప్రకారమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close