ఆర్జీవీ పాట‌: కరోనా కంటే భ‌యంక‌రంగా ఉందేంటి?

వ‌ర్మ షాకులు ఇవ్వ‌డంలో దిట్ట‌. ఎప్పుడు ఎలాంటి అనూహ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటాడో చెప్ప‌లేం. ఏం చేసినా ఓ క్రేజీ ఫీలింగ్‌తో చేసేస్తాడు. అందుకే ఆర్జీవీ ఓ స‌మ్ థింగ్ స్పెష‌ల్ జీవి. త‌న‌కు సామాజిక బాధ్య‌త లేద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ విష‌యాన్ని కాల‌ర్ ఎత్తుకుని మ‌రీ గ‌ర్వంగా చెబుతుంటాడు వ‌ర్మ‌. అయితే.. అదేంటో తెలీదుగానీ.. క‌రోనాపై పోరాటంలో త‌న వంతు సామాజిక బాధ్య‌తగా ఓ పాట రాసి, పాడి విడుద‌ల చేయ‌బోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా బ‌య‌ట‌కు వ‌దిలాడు.

అది ఒక్క పురుగు
క‌నిపించ‌ని పురుగు
క‌రోనా నీవొక పురుగు
న‌లిపేద్దామంటే అంత సైజులేదు దానికి
ప‌చ్చ‌డి చేద్దామంటే కండ‌లేదు దానికి
అదే దాని బ‌లం
అదే దాని ద‌మ్ము

అంటూ క‌రోనాపై ఓ పాట రాసేశాడు వ‌ర్మ‌. హార‌ర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు టైపు వాయిద్యాల‌తో, ఫ్యాక్ష‌న్ సినిమాలో ఫైటింగుల సౌండింగుల‌తో పాడేశాడు వ‌ర్మ‌. ఈ పాట పాడుతున్న‌ప్పుడు వ‌ర్మ ఇచ్చిన హావ‌భావాలు మీరు గ‌మ‌నించాల్సిందే. క‌రోనాని ఈ పాట‌తోనే చంపేద్దాం అన్న క‌సి వ‌ర్మ గొంతులో క‌నిపించిదంటే న‌మ్మండి. వ‌ర్మ పాట‌తో అప్పుడే సోష‌ల్ మీడియాలో సెటైర్లు మొద‌లైపోయాయి. వ‌ర్మ పాట విని క‌రోనా చ‌చ్చిపోవ‌డం గ్యారెంటీ అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. ప్రోమోనే ఇలా ఉందంటే.. ఇక పూర్తి పాట ఎలా ఉంటుందో. ర‌క్త‌పాతాలే ఇక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఒకే సినిమా.. ఒకేరోజు.. రెండు ప్రారంభోత్స‌వాలు

సినిమా ప్రారంభోత్స‌వం అంటే.. ఓ పండ‌గ‌లాంటిదే. మంచి ముహూర్తం చూసుకుని, కొబ్బ‌రికాయ కొడ‌తారు. ఆ రోజున తొలి షాట్ తీసి శ్రీ‌కారం చుడ‌తారు. సాధార‌ణంగా ఏ అన్న‌పూర్ణ స్టూడియోలోనో, రామానాయుడు స్టూడియోలోనో, లేదంటే...

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

HOT NEWS

[X] Close
[X] Close