ఏపీలో కరోనా విస్ఫోటం.. కౌంట్ 87..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు వెల్లువలా బయటకు వస్తున్నాయి. ఉదయం పది గంటలకు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోట్ ప్రకారం.. పాజిటివ్ కేసులు 87కి చేరాయి. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అరవైకి పైగా పెరిగాయి. పన్నెండు గంటల వ్యవధిలో43 శాంపిళ్లు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించారు. కడప జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. కానీ అనూహ్యంగా ఒక్క రోజులో.. అక్కడి అనుమానితులకు జరిపిన టెస్టుల్లో ఏకంగా పదిహేను మందికి పాజిటివ్ బయటపడింది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారు పెద్ద సంఖ్యలో ఉండటంతో.. వారికి టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారిలో పదిహేను మందికి పాజిటివ్బయటపడింది.

ఇవాళ పాజిటివ్‌గా తేలిన కేసుల్లో కడపలో పదిహేను, చిత్తూరు జిల్లాలో ఐదు,తూర్పుగోదావరి జిల్లాలోరెండు, కృష్ణా జిల్లాలోఒకటి, నెల్లూరు జిల్లాలోరెండు, ప్రకాశం జిల్లాలో నాలుగు, విశాఖలో ఒకటి, పశ్చిమగోదావరి జిల్లాలో పదమూడు కేసులు నమోదయ్యాయి. ఏపీలో అత్యధికంగా ప్రకాశం, కడపలో 15కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారు పెద్ద ఎత్తున ఉన్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పలువురితో కలిసి తరిగారు. ఇలాంటి వారందరి ఆచూకీ తెలుసుకుని .. క్వారంటైన్ కు తరలించడంతో పాటు.. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఉన్న పళంగా ఐసోలేషన్ కు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత వేగంగా…కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికి వందల సంఖ్యలో కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని.. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారి శాంపిల్స్ ను టెస్టుల కోసం పంపిస్తున్నారు బయట పడుతున్న పాజిటివ్ కేసులన్నీ.. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లిన వారివే 90 శాతం ఉండటంతో.. అలాంటి వారు ఎక్కడ ఉన్న వెంటనే… గుర్తించాలని..ప్రభుత్వం అధికారులను ఆదేశించారు.అయితే..పెద్ద సంఖ్యలో వారి ఆచూకీ తెలియక పోతూండటంతో.. అధికారులు టెన్షన్‌కు గురవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తాయా?

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర‌వాత‌..? - ప్ర‌స్తుతం ప్ర‌పంచం న‌డ‌వ‌డిక‌, మ‌నుషులు ఆలోచించే విధానం, బ‌తుకులు రెండు ర‌కాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటికంటే...

HOT NEWS

[X] Close
[X] Close