మీడియా వాచ్‌: ఈనాడులో బ‌ల‌వంత‌పు సెల‌వ‌లు

క‌రోనా ఎఫెక్ట్ అన్ని రంగాల‌పై ప‌డింది. మరీ ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగుల‌పై తీవ్ర సంక్షోభాన్ని నెట్టింది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కాన్సెప్టు అన్ని రంగాల్లోనూ తీసుకొచ్చారు. మీడియా కూడా అతీతం కాదు. నూటికి 50 శాతం ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. షిఫ్టుల ప్ర‌కారం ఆఫీసుకు వెళ్తున్నారు. ప్రింట్ మీడియా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఎప్పుడూ లేనిది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం కాన్సెప్ట్ ప్రింట్ మీడియా కూడా అప్లై చేస్తోంది.

ఈనాడులో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ మొద‌లైంది. ఓ డెస్కులో 5 గురు స‌భ్యులు ఉన్నార‌నుకుంటే, వాళ్ల‌లో ఇద్ద‌రు మాత్ర‌మే ఆఫీసుకురావాలి. మిగిలిన ముగ్గురూ ఇంటి నుంచి ప‌ని చేయాలి. కాక‌పోతే.. ఇంటి నుంచి ప‌నిచేసే వాళ్లంతా సెల‌వ‌లు పెట్టుకోవాలి. క్యాజువ‌ల్ లీవ్స్‌, సిక్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్ వంటిని వాడుకోవాలి. ఇంటి ద‌గ్గ‌ర ప‌నిచేస్తూ.. సెల‌వు పెట్టుకోవ‌డం ఎందుక‌న్న‌ది ఈనాడు ఉద్యోగుల వాద‌న‌. కానీ… యాజ‌మాన్యం మాత్రం `మీరు సెల‌వు పెట్టి, ఇంట్లోంచే ప‌ని చేయాలి` అంటూ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని స‌మాచారం. అంతే కాదు… లాక్ డౌన్ వ‌ల్ల ఈనాడు ప‌త్రిక‌కు ఆదాయం భారీ మొత్తంలో త‌గ్గ‌పోయింది. యాడ్లు లేకుండా పోవ‌డంతో పేప‌ర్‌ని మ‌రీ కుదించేశారు. కేవ‌లం 12 పేజీల‌కు ప‌రిమిత‌మైంది. జిల్లా పేప‌ర్లు లేనే లేవు. ఈ రూపంలో కాస్త ఖ‌ర్చు త‌గ్గించుకోగ‌లిగింది ఈనాడు. ఇప్పుడు దీని ప్ర‌భావం వ‌ల్ల కొన్ని ఉద్యోగాల‌కు ప్ర‌మాదం రానుంది. ఇప్ప‌టికే ఈనాడులో ప‌ని చేసే దిగువ శ్రేణి ఉద్యోగుల‌కు (బోయ్స్ లాంటివాళ్లు) ఈనాడు అధికారిక సెల‌వు ప్ర‌క‌టించింది. `మీరు ఆపీసుల‌కు రావాల్సిన అవ‌స‌రం లేదు. ఇంటి ప‌ట్టునే ఉండండి` అని చెప్పింది. అయితే ఈ సెల‌వుల కాలంలో జీతాలు ఇస్తారో, ఇవ్వ‌రో అనే విష‌యాన్ని మాత్రం చెప్ప‌నే లేదు. క‌రోనా ఉధృతి త‌గ్గాత త‌మ‌ని తీసుకుంటారో లేదో అన్న భ‌యాలు ఉద్యోగుల‌లో ఉంది. అంతే కాదు.. రిటైర్‌మెంట్ అయిపోయినా, ఎక్సైన్ష‌న్ వ‌ల్ల ఇంకా కొంత‌మంది ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారు ఈనాడులో ప‌దుల సంఖ్య‌లో ఉన్నారు. వాళ్లంద‌రికీ త్వ‌ర‌లో శాశ్వ‌త వీడ్కోలు త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. మొత్తానికి క‌రోనా ఎఫెక్ట్ ఈనాడు ఉద్యోగుల‌పై బ‌లంగానే ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close