మహేష్ ఖాతాలోకి మరో యాడ్ కాంట్రాక్ట్

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాతాలోకి మరో యాడ్ కాంట్రాక్ట్ వచ్చి చేరింది. భారతీయ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీసంస్థ ఇంటెక్స్ తమ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ప్రచారకర్తగా మహేష్‌బాబును నియమించుకుంది. తెలుగు రాష్ట్రాలకుగానూ తమ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు ఇవాళ హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. మొబైల్ వ్యాపారంద్వారా ఈ ఏడాది 8,000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నాలుగు యూనిట్లలో మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నామని, మరో మూడు-నాలుగు నెలల్లో గ్రేటర్ నొయిడా ప్లాంట్‌నుంచికూడా తయారీ మొదలవుతుందని వివరించారు. మహేష్ ద్వారా తమ ఫోన్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న మహేష్‌బాబు, ఇంటెక్స్ అందరికీ అందుబాటు ధరలలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోందని, ఈ సంస్థతో చేతులు కలపటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. అభిమానులతోబాటు తానుకూడా శ్రీమంతుడు విడుదలకోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. యథావిధిగా ప్రతి పబ్లిక్ ఫంక్షన్‌కూ వచ్చినట్లే ఈ ఫంక్షన్‌కూ అదే డార్క్ బ్లూ కలర్ షర్టే వేసుకుని వచ్చారు మహేష్. మొత్తానికి ఇటు సినిమాలు, అటు ఎడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా రెండుచేతులా సంపాదిస్తున్నారు ప్రిన్స్. అన్నట్లు ఈ బ్రాండ్‌కు ఉత్తరాదిన బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌డ‌న్ గా డ్రాప్ అయిన ద‌ర్శ‌కేంద్రుడు

`ఓం న‌మో వేంక‌టేశాయ‌` త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు మెగాఫోన్‌కి దూరం అయ్యారు. అదే ఆయ‌న చివ‌రి చిత్ర‌మ‌ని అప్ప‌ట్లోనే ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ సినిమా ఫ్లాప్‌. ఓ పరాజ‌యంతో.. ఓ అద్భుత‌మైన కెరీర్‌కి...

అవ‌స‌రాల‌తో నాని?

న‌టుడిగా విభిన్న‌మైన మార్క్ సంపాదించుకున్నాడు అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌. ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌త్యేక‌త చాటుకుంటూనే ఉన్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ని తీస్తూ... మంచి పేరే తెచ్చుకున్నాడు. ఊహ‌లు గుస‌గుస‌లాడే, జ్యో అత్యుతానంద చిత్రాలు...

బోయ‌పాటికి హీరోలు లేరా?

బోయ‌పాటి శ్రీ‌ను.. మాస్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు. హీరోకి ఆయ‌న ఇచ్చే ఎలివేష‌న్స్ ఇంకెవ్వ‌రూ ఇవ్వ‌రు. రాజ‌మౌళి త‌ర‌వాత ఎమోష‌న్స్ క్యారీ చేయ‌డం దిట్ట‌.. బోయ‌పాటే. కాక‌పోతే.. ఇవ‌న్నీ సినిమా హిట్ట‌యిన‌ప్పుడే. సినిమా...

దుబ్బాకలో కేసీఆర్ ప్రచారం ..!?

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. లక్ష మెజార్టీని లక్ష్యంగా పెట్టుకున్నానని హరీష్ రావు చెబుతున్నారు. ఆ దిశగా ఆయన తనదైన శైలిలో వ్యూహం రచిస్తున్నారు. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close