పుష్ష రేసులో మ‌రో బాలీవుడ్ విల‌న్‌

అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా షూటింగ్ మారేడుమ‌ల్లిలో నాన్ స్టాప్ గా సాగుతోంది. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తున్న చిత్ర‌మిది. ఇందులో దాదాపుగా ఎనిమిదిమంది విల‌న్ల వ‌ర‌కూ ఉంటార్ట‌. సునీల్‌, రావు ర‌మేష్‌, ముఖేష్‌రుషి.. ఇలా.. కొంత‌మంది సెట్ట‌య్యారు. అయితే ప్ర‌ధాన విల‌న్ ఎవ‌ర‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు. కాక‌పోతే.. రోజుకో పేరు వినిపిస్తోంది. ముందు.. విజ‌య్‌సేతుప‌తి పేరు అనుకున్నారు. బాబీ సింహా పేరు కూడా చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఆర్య‌.. పేరు కూడా గిర గిర తిరిగింది. అయితే వీళ్లెవ‌రూ కాద‌ని తేలిపోయింది.

ఇప్పుడు బాబీ డియోల్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ బాలీవుడ్ స్టార్‌ని… ప్ర‌తినాయ‌కుడిగా తీసుకుంటే, తెలుగు స్క్రీన్‌కు కొత్త‌గా ఉంటుంద‌ని సుకుమార్ భావిస్తున్నాడ‌ట‌. ఇందులో నిజం ఎంతో తెలీదు. కాక‌పోతే… విల‌న్ ఎవ‌రన్న‌ది సుకుమార్ త్వ‌ర‌గా తేల్చుకోవాల్సిన అవ‌స‌రం వుంది. ఎందుకంటే.. వ‌చ్చే షెడ్యూల్ లోనే విల‌న్ ఎంట్రీ ఇచ్చేయాలి. అందుకే.. సుకుమార్ కూడా విల‌న్ వేట‌లో ఇప్పుడు స్పీడు పెంచాడ‌ని స‌మాచారం. మారేడుమ‌ల్లి షెడ్యూల్ పూర్త‌య్యేలోగా విల‌న్ విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లార్డ్స్‌లో భారత్ కోసం ఎదురు చూస్తున్న టెస్ట్ వరల్డ్ కప్..!

ప్రపంచ టెస్ట్ చాంపియన్లుగా అవతరించడానికి భారత్‌కు గోల్డెన్ చాన్స్ వచ్చింది. లార్డ్స్ వేదికగా జూన్ 18 నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్ లో జరిగిన నాలుగో...

బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్...

బాలకృష్ణ కొడితేనే వైరల్.. కొట్టకపోతే నార్మల్..!

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ అభిమానిపై చేయి చేసుకున్నారు. నిజంగా ఆయన కొట్టకపోతేనే వార్త. కొడితే వార్త ఎందుకవుతుంది. పబ్లిక్‌లోకి వచ్చిన ప్రతీసారి తన చేతికి పని చెప్పడం ఆయనకు అలవాటు. ఆయన చేతి...

కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని నాయకులు: విజయసాయి పై బాలయ్య విసుర్లు

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ప్రచారంలో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి బాలయ్య చేసిన విమర్శలు...

HOT NEWS

[X] Close
[X] Close