పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యం, పంచాయతీ ఎన్నికలు రెండూ ముఖ్యమేని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ… సింగిల్ బెంచ్ ఇచ్చి తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టి వేసింది. ఈ మేరకు ఎస్‌ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని సూచించింది. ఓ సారి ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన తర్వాత … అందులో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు స్వతంత్ర భారతావనిలో లేవు. అయితే అనూహ్యంగా ఏపీలో వ్యాక్సినేషన్ కారణంగా చూపుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్ గంగారావు అనుమతించి.. ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘం రిట్ అప్పీల్ దాఖలు చేసింది.

మొదట సంక్రాంతి సెలవుల సమయంలో.. ఈ రిట్ అప్పీల్ దాఖలు చేయగా.. తర్వాత రెగ్యులర్ కోర్టులో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతుందని వాయిదా వేశారు. ఈ మేరకు సెలవుల తర్వాత కోర్టు పనిదినాలు ప్రారంభమైన మొదటి రోజే.. మొదటి విచారణగా స్వీకరించి.. రెండు రోజుల పాటు వాదనలు విన్నారు. రెండు రోజుల కిందట తీర్పును రిజర్వ్ చేశారు. నేడు ప్రకటించారు. హైకోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించనున్నారు. కోడ్ కూడా అమల్లో ఉండనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టదలతో ఉన్న ఏపీ సర్కార్.. ఇప్పుడు ఏం చేస్తుందన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

ఇప్పుడు నిమ్మగడ్డకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఇస్తే.. ఆయన అధికార యంత్రాగాన్ని మొత్తం ప్రక్షాళన చేస్తారు. ఎన్నికలు నిర్వహణకు గతంలో సీఎస్, డీజీపీ సహకరించలేదు కాబట్టి.. ఆమేరకు వారిని బదిలీ చేసి కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. ఇది ఏపీ సర్కార్ కు ఇబ్బందికరం. గతంలోనే కొంత మంది అధికారుల్ని బదిలీ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించినా ప్రభుత్వం పాటించలేదు., ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి.. సుప్రీంకోర్టుకైనా వెళ్లాలన్న ఆలోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close