‘లూసీఫ‌ర్’ రేసులో మ‌రో ద‌ర్శ‌కుడు

మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ సినిమా `లూసీఫ‌ర్‌`ని తెలుగులో రీమేక్ చేయాల‌ని చిరంజీవి భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ క‌థ‌ని తీర్చిదిద్ద‌గ‌ల ద‌ర్శ‌కుడు ఇంకా దొర‌క‌లేదు. ముందుగా సుజిత్ ని అనుకున్నారు. ఆ త‌ర‌వాత వినాయ‌క్ వ‌చ్చాడు. వినాయ‌క్ కూడా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. హ‌రీష్ శంక‌ర్ పేరు వినిపించినా, ఈ సినిమా చేయ‌డానికి హ‌రీష్ సుముఖంగా లేడ‌ని తెలుస్తోంది.

ఇప్పుడు `లూసీఫ‌ర్‌` రేసులో మ‌రో ద‌ర్శ‌కుడు వ‌చ్చి చేరాడు. త‌నే మోహ‌న్ రాజా. ధృవ సినిమాకి మాతృక అయిన `త‌ని ఒరువ‌న్‌`కి ఆయ‌నే ద‌ర్శ‌కుడు. ఇప్పుడు `త‌ని ఒరువ‌న్ 2` తెర‌కెక్కిస్తున్నారు. మోహ‌న్ రాజా.. ఎడిట‌ర్‌రాజా వాళ్ల అబ్బాయి. ఎడిట‌ర్ రాజాకీ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. తెలుగులో ఓసినిమా చేయాల‌ని మోహ‌న్ రాజా కూడా ఎప్ప‌టి నుంచో వెయిటింగ్. చిరుతో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే.. త‌ను క‌చ్చితంగా వ‌దులుకోడు. ప్ర‌స్తుతం మోహ‌న్ రాజాతో సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. అతి త్వ‌ర‌లో ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

టీఆర్ఎస్‌ను మించి కాంగ్రెస్ మేనిఫెస్టో ..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20వేల లీటర్ల మంచినీరు ఉచితం అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదని.. తాము 30వేల లీటర్లు ఇస్తామని హామీ ఇచ్చేసింది. గ్రేటర్ కాంగ్రెస్...

HOT NEWS

[X] Close
[X] Close