సెంటిమెంట్ కొన‌సాగించిన మ‌హేష్ బాబు

సినిమావాళ్ల‌కు సెంటిమెంట్లు ఎక్కువ‌. మ‌హేష్‌బాబు సైతం అందుకు అతీతం కాదు. మ‌హేష్‌కీ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. మూడ‌క్ష‌రాల టైటిల్ ని పెట్టుకోవ‌డం మ‌హేష్ సెంటిమెంట్. అది చాలాసార్లు వ‌ర్కువ‌ట్ అయ్యింది కూడా. త‌న సినిమా ముహూర్తం రోజున‌, తొలి క్లాప్ కొట్టేటప్పుడు రాక‌పోవడం సైతం మ‌హేష్‌కి అల‌వాటే. మ‌హేష్ సినిమా ఓపెనింగ్ జ‌రిగిన రోజు.. మ‌హేష్ ఆ స్పాట్ లో క‌నిపించ‌డు.

అదే సెంటిమెంట్ ఈ సారీ రిపీట్ అయ్యింది. మ‌హేష్ – ప‌రశురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. కీర్తి సురేష్ క‌థానాయిక‌. ఈ చిత్రాన్ని ఈరోజు ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. హైద‌రాబాద్ లోని ఓ దేవ‌స్థానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమాకి శ్రీ‌కారం చుట్టారు. మ‌హేష్ భార్య న‌మ్ర‌త స్విచ్చాన్ చేస్తే.. మ‌హేష్ త‌న‌య సితార క్లాప్ కొట్టింది. జ‌న‌వ‌రి మొద‌టి వారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎంపీ భూముల్ని వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కినెటా పవర్ ప్రాజెక్ట్స్ అనే సంస్థకు ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. నెల్లూరు జిల్లా చిల్లకూర్ మం. తమ్మినపట్నం, మోమిడి గ్రామాల్లో.. ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు...

గ్రేటర్ ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్.. !

గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. వివాదాలు సృష్టించడానికేనన్నట్లుగా చెలరేగిపోతున్నారు. తాజా ఆయన నోటి వెంట సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. అది...

అభిజిత్‌ను గెలిపించి బిగ్ బాస్ నిర్వాహకులు ఆ తప్పు చేస్తారా!

Sravan Babu, Freelance Journalist బిగ్ బాస్ - 4లో ఫైనల్‌కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్‌లలో ఖచ్చితంగా అభిజిత్ ఉంటాడనటంలో ప్రేక్షకులు ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అతనే విన్నర్ అవుతాడనే వర్గాలు...

టీఆర్ఎస్‌ను మించి కాంగ్రెస్ మేనిఫెస్టో ..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20వేల లీటర్ల మంచినీరు ఉచితం అని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తానేం తక్కువ తినలేదని.. తాము 30వేల లీటర్లు ఇస్తామని హామీ ఇచ్చేసింది. గ్రేటర్ కాంగ్రెస్...

HOT NEWS

[X] Close
[X] Close