తెరపైకి వివేకా రెండో భార్య షమీమ్ !

వైఎస్ వివేకా హత్య కేసులో నిండా మునిగిపోయిన నిందితులు కొత్త కొత్త కథలు తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇంత కాలం బయటకు రాని వైఎస్ వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అంటూ ఆమె తరపు లాయర్ ఓ రిపోర్టును మీడియాకు పంపారు. అందులో ప్రధానంగా వివేకా కుమార్తెను.. వివేకా బావమరిదిని టార్గెట్ చేసి వాంగ్మూలం ఇచ్చినట్లుగా స్పష్టంగాఉంది.

వైఎస్ వివేకానంద రెడ్డితో 2010 లో తనకు వివాహం అయ్యిందని షేక్ షమీమ్ తెలిపారు. అయితే 2011లో మరోసారి వివాహం చేసుకున్నామన్నారు. రెండు సార్లు వివాహం జరిగినట్లుగా షమీమ్ తెలిపారు. 2015లో తమకు షహన్ షా పుట్టారని సీబీఐకి తెలిపింది. వివేక హత్యకు కొన్ని గంటల ముందు కూడా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు షమీమ్ తెలిపారు. తమ వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఆమె తెలిపారు. వివేకా బామ్మర్ది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తనను, తన కుటుంబ సభ్యుల్ని ఎన్నోసార్లు బెదిరించారని ఆమె సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తెలిపారు.

వివేకాకు దూరంగా ఉండమని సునీతా రెడ్డి సైతం హెచ్చరించేదని షమీమ్ వెల్లడించారు. వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాశ్ రెడ్డి కన్నేశారని షమీర్ ఆరోపించారు. తమ కొడుకు షహన్ షా పేరు మీద 4 ఏకరాలు కొందామని వివేకా అనుకున్నా.. శివ ప్రకాష్ రెడ్డి ఆపేశాడని ఆమె వివరించారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. అన్యాయంగా వివేకా చెక్ పవర్ తొలగించారని ఆమె ఆరోపించారు. చెక్ పవర్ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడని షమీమ్ తెలిపారు. బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా 8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పాడని.. హత్యకు కొన్ని గంటల ముందు కూడా 8 కోట్లు గురించి ఆయన తనతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చనిపోయిన తరువాత వివేకా ఇంటికి వెళ్దామనుకున్న.. శివ ప్రకాష్ రెడ్డి మీద భయంతో అటు వైపు వెళ్లలేకపోయానని షమీమ్ వెల్లడించారు.

షమీమ్ మీడియా ముందుకు రాలేదు. ఆమె వివేకా ఆస్తుల కోసం రేపోమాపో కోర్టులో పిటిషన్ వేయబోతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ముందు ముందు వైఎస్ వివేకా రెండో భార్య హడావుడి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close