అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీం స్టే – కానీ

తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు పూర్తి కానందున సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని సీబీఐకి సూచించింది. సోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇరవై నాలుగో తేదీకి విచారణను వాయిదా వేశారు. అయితే ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు తుది ఉత్తర్వులు 25వ తేదన ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ పై స్టే విధించడంతో హైకోర్టు తుది తీర్పు ఇస్తుందో లేదో స్పష్టత లేదు కానీ.. అంతకు ముందు రోజే సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరగనుంది.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సునీత కీలక విషయాలు వెల్లడించింది. సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని .. ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావునిస్తోందన్నారు. అవినాశ్ రెడ్డి పేరు వచ్చిన తరువాతే జగన్ యాక్టివ్ అయ్యారని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డిల పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు కొనసాగనీయకుండా అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారన్నారు.

శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సీబీఐ హాజరు పరిచినప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాల పాటు శివశంకర్ రెడ్డితో గడిపారన్నారు. అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సీబీఐ అధికారులను అవినాశ్ రెడ్డి బెదిరించారని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చిందన్నారు. కడప జ్యుడిషియల్ మాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారి రాంసింగ్‌పై చేసిన ఫిర్యాదును స్వీకరించి, కడప పోలీసు స్టేషన్‌కి పంపించారని సునీత తన పిటిషన్‌లో వెల్లడించారు.

ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా అవినాశ్‌రెడ్డిని 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లి తప్పుచేసింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ క్రమంలో ఎటువంటి ఆంక్షల్లేకుండా దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలని సునీత పిటిషన్‌లో కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close