సురేంద‌ర్ రెడ్డి కి మ‌రో మెగా ఛాన్స్‌?

ధృవ‌, సైరా.. ఇలా మెగా కుటుంబానికి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చాడు సురేంద‌ర్ రెడ్డి. అల్లు అర్జున్‌కి ఇది వ‌ర‌కే రేసుగుర్రంలాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ అందించాడు. అలా మెగా ఫ్యాన్స్‌కి ఎప్పుడో ద‌గ్గ‌రైపోయాడు. ఇప్పుడు మ‌రోసారి సూరిని మెగా ఆఫ‌ర్ వ‌రించ‌బోతోంద‌ని టాక్‌. `ధృవ‌` స‌మ‌యంలోనే చిరంజీవితో సినిమా చేసే అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. ఆ స‌మ‌యంలో `సైరా` ప్ర‌తిపాద‌నే లేదు. అప్పుడే చిరు కోసం ఓ స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ రాసుకున్నాడు. ఆ క‌థ చ‌ర్చ‌ల్లో ఉండ‌గానే `సైరా` ప్రాజెక్టు సూరి చేతికి వ‌చ్చింది. సూరి చెప్పిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ ఇప్పుడు మ‌రోసారి లైన్‌లో పెట్టాల‌ని సురేంద‌ర్ రెడ్డి భావిస్తున్నాడ‌ట‌. అయితే చిరంజీవి – సురేంద‌ర్ రెడ్డి కాంబో.. ప‌ట్టాలెక్క‌డానికి మాత్రం చాలా టైమ్ ఉంది. కొర‌టాల‌, త్రివిక్ర‌మ్‌ల‌తో సినిమాలు పూర్త‌య్యాక‌… సూరితో సినిమా ఉండొచ్చు. లేదంటే ఆ క‌థ‌ని అటూ ఇటూ మార్చి రామ్‌చ‌ర‌ణ్‌కి సెట్ చేయొచ్చు. ఏదైతేనేం.. మెగా కాంపౌండ్‌లో సురేంద‌ర్ రెడ్డి మ‌రో సినిమా చేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close