ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్‌

ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వ‌స్తుందేమో అని ఫ్యాన్స్ చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. టైటిల్ కూడా చెప్ప‌లేదు. టీజ‌ర్ గొడ‌వే లేదు. ఈ మూడింట్లో ఏదో ఒక‌టి… ప్ర‌భాస్ పుట్టిన రోజున విడుద‌ల చేస్తార‌ని భావించారు. అయితే… 23న అలాంటి గిఫ్టులేం లేవు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. టైటిల్ విష‌యంలో ఇంకా ఓ స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో… 23న టీజ‌ర్లు, పోస్ట‌ర్లూ విడుద‌ల చేయ‌లేక‌పోతోంది చిత్ర‌బృందం. విడుద‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉందికాబ‌ట్టి – అప్పుడే హ‌డావుడి మొద‌లెట్ట‌కూడ‌ద‌ని భావిస్తోంద‌ట‌. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com